Telangana Inter Results: రేపే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు.. ఎలా చెక్ చేసుకోవాలంటే..
Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలను సోమవారం వెల్లడించనున్నారు. ఇదే విషయాన్ని..
Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలను సోమవారం వెల్లడించనున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం సమయానికి ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు www.tsbie.cgg.gov.in లో ఫలితాలు చూడొచ్చని చెప్పారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలతో పాటు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. తొలుత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా, పరీక్షల రద్దు నేపథ్యంలో విద్యార్థులకు ఏ విధంగా మార్కులు వేస్తారనేది కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆయా సబ్జెక్టుల్లో ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులనే సెకండ్ ఇయర్‌కి కూడా కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఇక ప్రాక్టికల్స్‌కు సంబంధించినంత వరకు 100 శాతం మార్కులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే, ఫెయిల్ విద్యార్థులకు మాత్రం.. ఆయా సబ్జెక్టులకు 35 శాతం మార్క్స్ కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చిన మార్కుల పట్ల సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు అనుకూలంగా మారిన తరువాత ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది.
Also read: