AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న మహిళ..

Suryapet: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపి..

Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న మహిళ..
Suicide
Shiva Prajapati
|

Updated on: Jun 27, 2021 | 10:14 PM

Share

Suryapet: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపి.. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాపురంలో శ్రీనాథ్, మౌనిక దంపతులు ఉన్నారు. వీరి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనాథ్ గ్రామంలో ఆర్ఎంపీగా సేవలు అందిస్తున్నాడు. అయితే, మౌనిక, శ్రీనాథ్ మధ్య ఇటీవల తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, ఆదివారం నాడు ఓ పేషెంట్ తన వద్దకు రాగా.. శ్రీనాథ్ వారిని తీసుకుని ఖమ్మం వెళ్లాడు.

అలా శ్రీనాథ్ ఖమ్మం వెళ్లి వచ్చే సరికి మౌనిక ఊహించని దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరు పిల్లలను ఉరి వేసి చంపేసింది. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుని చనిపోంది. శ్రీనాథ్ ఇంటికి వచ్చి చూసేసరికి.. తన భార్య, పిల్లలు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే మౌనిక ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణకు వచ్చారు.

Also read:

Weight Loss : బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా..! పరగడుపున బీట్‌రూట్ డిటాక్స్ పానీయం తాగండి..