Donkey Meat: గాడిద మాంసాన్ని లొట్టలేసుకొని తింటున్న జనాలు.. ఎక్కడో తెలుసా? కిలో మాంసం రూ.600..
Donkey Meat: ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలో గాడిద మాంసాన్ని భోజన ప్రియులు లొట్టలేసుకొకి లాగించేస్తున్నారు. కిలోకు ఏకంగా రూ. 600 పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో వందల్లో గాడిద మాసం విక్రయ కేంద్రాలు వెలిశాయి...
Donkey Meat: ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలో గాడిద మాంసాన్ని భోజన ప్రియులు లొట్టలేసుకొకి లాగించేస్తున్నారు. కిలోకు ఏకంగా రూ. 600 పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో వందల్లో గాడిద మాసం విక్రయ కేంద్రాలు వెలిశాయి. తెలంగాణలో జహీరాబాద్, ఏపీలో కర్నూల్ సంతల నుంచి తాడేపల్లికి పెద్ద ఎత్తున గాడిద మాంసం సరఫరా అవుతోంది. ఆస్తామా, కీళ్ల నొప్పులకు గాడిద మాంసం దివ్య ఔషధం అంటూ ప్రచారం చేస్తూ విచ్చలవిడిగా గాడిద మాంసాన్ని యథేశ్చగా అమ్మేస్తున్నారు. అయితే ఏపీలో గాడిద వదకు సంబంధించి ఏలాంటి కబేళాలు లేవు.. దీంతో ఇంత పెద్ద మొత్తంలో గాడిద మాంసం అమ్మకాలు జరుగుతుండడంతో ఇవన్నీ అక్రమంగా జరుగుతోన్న తంతుగానే అర్థమవుతోంది. విజయవాడ నగర శివర్లలో ఉన్న కండ్రిక, ప్రకాష్ నగర్,వైస్సార్ కాలనీ, ఈడూపుగళ్ళు, తద్వెపల్లి మార్కెట్లలో భారీ ఎత్తున గాడిద మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి.
శాస్త్రీయత లేని మాంసం తినడం అనారోగ్యం..
కరోనా లాంటి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి శాస్త్రీయత లేని గాడిద మాంసం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కూడా కారణమని చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాయో లేదో కూడా తెలియకుండా వధించిన పంది, గాడిద మాంసం తీసుకుంటే దుష్ఫ్రభావాలు తప్పవని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Telugu : తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి.. ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు