Covid Kissing Scandal: పీఏతో మంత్రిగారి ముద్దు.. ముచ్చట.. కెమెరాకు చిక్కిన యవ్వారం..

తీగలాగితే డొంక కదిలినట్లు.. సీసీ కెమెరా ఓపెనె చేస్తే ఓ మంత్రి యవ్వారం బయటపడింది. ఇది కాస్తా..  రచ్చ రచ్చగా మారింది. వివాహితుడైన హాంకాక్‌.. ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్‌తో..

Covid Kissing Scandal: పీఏతో మంత్రిగారి ముద్దు.. ముచ్చట.. కెమెరాకు చిక్కిన యవ్వారం..
Covid Kissing Scandal
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 27, 2021 | 10:13 PM

తీగలాగితే డొంక కదిలినట్లు.. సీసీ కెమెరా ఓపెనె చేస్తే ఓ మంత్రి యవ్వారం బయటపడింది. ఇది కాస్తా..  రచ్చ రచ్చగా మారింది. వారం నుంచి యూకే రాజకీయాలను కుదేలు చేస్తోంది. కెమెరాలో చిక్కింది ఎవరో కాదు ఓ దేశ ఆరోగ్య శాఖ మంత్రి..  అసలు కథేంటో ఓ సారి చూద్దాం… ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి మ్యాట్‌​ హాంకాక్‌ వ్యవహారం.. వివాహితుడైన హాంకాక్‌.. ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్‌గా నియమించుకున్నాడు.

ఆమెతో తన కార్యాలయంలోనే రాసలీలు మొదలు పెట్టాడు. ఆమెను ముద్దులతో ముంచేశాడు. ఈ ఫోటోలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచూరించాయి. ఇది కాస్తా ఆ ముద్దుగుమ్మను ముద్దులు పెట్టుకున్నట్లుగా ఓ ఫొటోతో ‘పీఏతో హాంకాక్‌ రాసలీలలు’ పేరుతో “ది సన్‌ టాబ్లాయిడ్‌” పత్రికలో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించింది. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పైగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న టైంలో ఆ పని చేశాడంటూ కథనం ప్రచురించింది. ఇంకేం రాజకీయ విమర్శలు.. రాజకీయ రచ్చకు కారణమైంది

ఈ ఇద్దరి మధ్య బంధం…

కాగా, ఆ ఫొటోలు మే 6 నుంచి 11 మధ్య కాలంలో తీసినవని తెలుస్తోంది. అది కూడా మ్యాట్‌ కార్యాలయంలోనే తీసినవని సమాచారం. అయితే ఆ ఫొటోల్ని ఎలా సంపాదించింది మాత్రం సన్‌ పత్రిక వెల్లడించలేదు. అప్పటికీ ఇంకా లాక్‌డౌన్ కఠిన నిబంధనల్ని, ఆంక్షల్ని ఎత్తివేయలేదని మాత్రం పేర్కొంది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారిని కౌగిలించుకోవడం… వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని ఆ వార్తలో రాసుకొచ్చింది.

అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మహిళను హాంకాక్‌.. 2000 సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో కలిశాడని, పోయిన నెలలోనే ఆమెను ఇన్‌కంటాక్స్‌ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తేలింది.

రాజీనామా చేయక తప్పలేదు…

కోవిడ్ వ్యాప్తి సమయంలో మాస్క్‌లు లేకుండా తిరగొద్దని హాంకాక్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కరోనాపైగా భావోద్వేగంగా… అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చాడు. తాను చెప్పిన… పెట్టిన నిబంధనలను తుంగలో తొక్కారు అంటూ అక్కడి ప్రతి పక్ష పార్టీలు విమర్శలు వెలువెత్తాయి. ఈ మేరకు శనివారం ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు, మాట్‌ హాంకాక్‌కు ఓ క్షమాపణ లేఖ రాశాడు. నేనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించా.. అందుకే రాజీనామా చేస్తున్నా అంటూ లేఖలో పేర్కొన్నాడు. ఇక విమర్శల నేపథ్యంలో హాన్‌కాక్‌ రాజీనామాను ఆమోదించిన బోరిస్‌.. అప్పటిదాకా ఆయన అందించిన సేవలను కొనియాడాడు.

ఇవి కూడా చదవండి : YSRCP MP Vijayasai Reddy: ముద్రగడను ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రశ్నలు

Aadhaar Link : భూ రికార్డులతో ఆధార్ అనుసంధానం.. పారదర్శకత కోసం మరో రెండిటితో లింక్..! ఏంటో తెలుసుకోండి..?

Marri Shashidhar Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ పదవి రచ్చ.. రాజీనామా చేసిన మరో సీనియర్ నేత..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!