Viral Video: కోడిపిల్లకు ముద్దుల మీద ముద్దులు పెడుతున్న కోతిపిల్ల.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Viral Video: సోషల్ మీడియా వచ్చాక యావత్ ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది.
Viral Video: సోషల్ మీడియా వచ్చాక యావత్ ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. ప్రసార సాధణాల కంటే కూడా జెట్ స్పీడ్‌లో సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తోంది. ఇందులో అనేక రకాల విషయాలు ఉంటాయి అది వేరే విషయం. ముఖ్యంగా సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలో భాగా వైరల్ అవుతుంటాయి. అవి చేసే చిలిపి చేష్టలు, వింత పనులు, ఊహకందని ప్రవర్తనను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. నిజానికి జంతువులు చేసి అల్లరిని ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఉన్నవి రెండూ పిల్లలే.. ఒకటి జంతువు అయితే, మరొకటి పక్షి. ఈ రెండూ కలిసి చేసిన అల్లరి పని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. సీన్ కట్ చేస్తే.. అటు పిల్లకోతి.. ఇటు కోడిపిల్ల. ఈ రెండూ ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. కోతిపిల్ల అరటి ఆకుపై కూర్చుని కోడిపిల్లతో సరదాగా ఆడుకుంటుంది. తన చేతితో కోడిపిల్లలను పట్టుకుంటుంది. అది ఎన్నిసార్లు పారిపోవడానికి ప్రయత్నించినా అస్సలు వదిలిపెట్టలేదు. కోడిపిల్లలు తన రెండు చేతులతో దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. అంతేకాదు.. దానిపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ అల్లరి కోతిపిల్ల, క్యూట్ కోడిపిల్ల వీడియో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆయన అలా పోస్ట్ చేయడమే ఆలస్యం.. అది తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను 16 గంటల క్రితం పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 15 వేల సార్లు వీక్షించారు. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
Loved this magical interactions of two pure souls ? pic.twitter.com/FSV6c0Ite2
— Susanta Nanda IFS (@susantananda3) June 27, 2021
Also read:
Viral Video: తన జుట్టునే దుస్తులుగా మార్చేసిన యువతి.. చూస్తే నోరెళ్లబడెతారంటే..
Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో కుండపోత వానలు