Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీఆర్‌ఎస్‌లో బంపరాఫర్‌ కొట్టేసిన మాజీ నేతలు.. హరీశ్‌ రావుతో డిన్నర్‌ మీట్‌లో డీల్‌ సెట్‌

పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డామని తమ జీవితాలను దార పోసి అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని పెంచామని అయినా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని నంది కంటే శ్రీధర్, తిరుపతిరెడ్డి మదనపడ్డారు. దీంతో ఈ నెల ఒకటిన మొదట కంటారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆ తెల్లారే మల్కాజిగిరి అభ్యర్థి నంది కంటి శ్రీధర్ కూడా రాజీనామా సమర్పించాడు. అయితే శ్రీధర్ రాజీనామా లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Follow us
Sravan Kumar B

| Edited By: Basha Shek

Updated on: Oct 05, 2023 | 10:21 PM

మైనంపల్లి హనుమంతరావు ఫ్యామిలీ కాంగ్రెస్ లోకి జంపు కావడంతో మల్కాజ్‌గిరి మైనంపల్లికి మెదక్ మైనంపల్లి కొడుకు రోహిత్ కి కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. దీంతో ఇప్పటివరకు ఈ స్థానాలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థి కంటారెడ్డి తిరుపతిరెడ్డి తీవ్రంగా మన స్థాపన చెందారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డామని తమ జీవితాలను దార పోసి అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని పెంచామని అయినా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని నంది కంటే శ్రీధర్, తిరుపతిరెడ్డి మదనపడ్డారు. దీంతో ఈ నెల ఒకటిన మొదట కంటారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆ తెల్లారే మల్కాజిగిరి అభ్యర్థి నంది కంటి శ్రీధర్ కూడా రాజీనామా సమర్పించాడు. అయితే శ్రీధర్ రాజీనామా లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గత 35 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డానని అయినా కూడా డబ్బు సంచులు మోస్తున్న వాళ్ళకి పార్టీ టికెట్ కేటాయించి అన్యాయం చేసి మరోసారి బీసీల పట్ల కాంగ్రెస్ తన వైఖరిని చూపించిందని లేఖలో పేర్కొన్నారు. ఇక మెదక్ డీసీసీ తన లేఖలో కష్టపడ్డ వాళ్లకి కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని వ్యాఖ్యానించారు.అయితే నందికంటి శ్రీధర్, తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం పలికింది. కంటారెడ్డి తిరుపతిరెడ్డికి మాత్రం కాంగ్రెస్ పార్టీ కంటే బంపర్ ఆఫర్ ఇచ్చింది బీఆర్‌ఎస్‌. ఏకంగా మంత్రి హరీష్ రావు తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లి డిన్నర్ మీట్‌లో డీల్ సెట్ చేశారు. తిరుపతి రెడ్డికి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కన్ఫామ్ చేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు మెదక్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు కచ్చితంగా ఎంపీ సీటు వచ్చేలా కేసీఆర్‌ తో మాట్లాడి ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో తిరుపతి రెడ్డి పరిస్థితి నక్క తోక తొక్కినట్టుగా మారింది.

కాగా ఈ డిన్నర్ మీట్‌లో మంత్రి కేటీఆర్ కూడా పాల్గొనాల్సి ఉండగా చివరి క్షణంలో క్యాన్సిల్ అయింది. కేటీఆర్ తిరుపతిరెడ్డి తో ఫోన్లో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించి ప్రత్యేకంగా మరోసారి వచ్చే కలుస్తానని కేసీఆర్ తో మాట్లాడి తమ కోరుకున్నట్టు గా సమచితస్థానం పార్టీలో కల్పిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకోవడంతో బీఆర్‌ఎస్‌ సక్సెస్ అవుతూ వస్తోంది. మల్కాజ్గిరి లో మైనంపల్లి ని మెదక్‌లో కొడుకు రోహిత్ ని ఓడించి తీరాలని పార్టీ మారిన నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి