Rajinikanth: కరుణా నిధి సంభాషణలా నావల్లకాదు.. అంతకన్నా బస్సులో టిక్కట్లు కొట్టుకుంటాను.:రజనీకాంత్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన సినీ రచయిత కూడా. ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. సినిమాలలో రచనలు చేయడం ద్వారా ద్రవిడ భావజాలానికి ప్రాచుర్యం కల్పించారు. ఒకానొక సందర్భంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు కరుణానిధి సంభాషణలు రాస్తున్నారని తెలిసి రజినీ భయపడిపోయారట. ఆయన డైలాగ్స్ రాస్తే తాను నటించలేనని చెప్పారట.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన సినీ రచయిత కూడా. ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. సినిమాలలో రచనలు చేయడం ద్వారా ద్రవిడ భావజాలానికి ప్రాచుర్యం కల్పించారు. ఒకానొక సందర్భంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు కరుణానిధి సంభాషణలు రాస్తున్నారని తెలిసి రజినీ భయపడిపోయారట. ఆయన డైలాగ్స్ రాస్తే తాను నటించలేనని చెప్పారట. ఈ విషయం ఓ దినపత్రికలో రాసిన వ్యాసంలో సూపర్ స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. 1980లో ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించానని, ఆ చిత్రానికి సంభాషణలు రాసేందుకు కరుణానిధి ఒప్పుకున్నారని నిర్మాత చెప్పడంతో రజనీ కంగారు పడ్డానని పేర్కొన్నారు. సాధారణ తమిళం మాట్లాడటానికే కష్టపడుతున్న తాను ఏకంగా కరుణానిధి సంభాషణలు మాట్లాడుతూ నటించడం అసాధ్యంగా అనిపించిందని తెలిపారు. అందుకు బదులు కర్ణాటకకు వెళ్లి బస్సులో టికెట్లు కొట్టుకుంటే మంచిదని భావించానని పేర్కొన్నారు. కరుణానిధి సంభాషణలు రాస్తే నటించలేనని, ఆ విషయం ఆయనకే స్వయంగా చెప్పేందుకు నిర్మాతను వెంటపెట్టుకొని కరుణానిధి దగ్గరకు వెళ్లానని తెలిపారు. గోపాలపురంలో కరుణానిధిని కలిసి, సాధారణ తమిళం మాట్లాడటానికే ఇబ్బంది పడుతున్నానని, మీ సంభాషణలు చెప్పడం అసాధ్యమని, తప్పుగా భావించొద్దని విజ్ఞప్తి చేశానని తెలిపారు. అందుకు ఆయన నవ్వుతూ, సంభాషణలు ఎవరికెలా రాయాలో తనకు తెలుసని నచ్చజెప్పబోయారని, అయితే తర్వాత తన ఇబ్బందిని అర్ధం చేసుకొని, సున్నితంగా ఆ సినిమాకు తను డైలాగ్స్ రాయనని నిర్మాతకు చెప్పినట్టు తెలిపారు. తర్వాత నిర్మాతను పిలిపించి చిత్రీకరణ ఈ నెల పదో తేదీ అంటున్నారే, నేను వచ్చే నెల అనుకుని సంభాషణలు రాయడానికి ఒప్పుకొన్నాను. అలాగైతే నాకు సాధ్యపడదు. తర్వాతి సినిమాకు చూద్దామంటూ సున్నితంగా తిరస్కరించారని పేర్కొన్నారు. తర్వాత తనను చూసి సంతోషమా అని అడిగారని, అటు నిర్మాతను నొప్పించకుండా నన్నూ సంతోషపరిచారు అంటూ గత స్మృతులను పంచుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

