Gold Price: తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!

నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించిన వెంటనే ఒక్కసారిగా బంగారం ధరలు 10 గ్రాములకు 3 వేల నుంచి 4 వేల వరకు తగ్గాయి. ఈ ఊహించని ప్రకటనకు పసిడి ప్రియులు ఇది నిజమేనా అన్నట్టు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారు. మొత్తంగా బంగారం ధర ఒక్క రోజులోనే కిలోకు 6 లక్షల 20 వేలు మేర క్షీణించింది. కిలో వెండి ధర కూడా కేజీకి 3,000 రూపాయల మేర తగ్గింది.

Gold Price: తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు  ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!

|

Updated on: Jul 28, 2024 | 1:42 PM

నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించిన వెంటనే ఒక్కసారిగా బంగారం ధరలు 10 గ్రాములకు 3 వేల నుంచి 4 వేల వరకు తగ్గాయి. ఈ ఊహించని ప్రకటనకు పసిడి ప్రియులు ఇది నిజమేనా అన్నట్టు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారు. మొత్తంగా బంగారం ధర ఒక్క రోజులోనే కిలోకు 6 లక్షల 20 వేలు మేర క్షీణించింది. కిలో వెండి ధర కూడా కేజీకి 3,000 రూపాయల మేర తగ్గింది. మరి ఈ తగ్గుదల ఎన్నాళ్లుంటుంది..? ఇప్పుటికిప్పుడు బంగారం కొనేయాల్సిందేనా..? బంగారంలో పెట్టుబడులు పెట్టాలంటే ఇదే సరైన సమయమా..? అప్పు చేసైనా బంగారం కొనక తప్పదా..? ఇలాంటి ప్రశ్నలు.. చుట్టుపక్కలున్న వారి సలహాలు.. ఇలా చాలా సమస్యలు అనుకోకుండా బంగరం ధరలు తగ్గడం వల్ల కొత్తగా పుట్టుకొచ్చినవే. వీటన్నింటికీ తోడు.. ఇంట్లో వాళ్ల సణుగుళ్లు.. దెప్పి పొడుపులు.. సగటు మధ్యతరగతి ఉద్యోగిని వెంటాడుతునే ఉంటాయి.

సరే.. వాటిని కాసేపు పక్కన పెట్టేస్తే.. నిజంగానే బంగారం ఇప్పుడు కొనాల్సిందేనా..? ఈ ప్రశ్నకు నిపుణులు.. మీ దగ్గర కొనే తాహతు ఉంటే.. ఇది రైట్ టైం అనే చెబుతున్నారు. బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం వల్లే ఒక్కసారిగా బంగారం ధర ఊహించని స్థాయిలో పడిందని.. కొనాలనుకున్న ప్లాన్లలలో ఉన్న వాళ్లకు ఇదే సరైన సమయం అని అంటున్నారు. ఇప్పటివరకు బంగారం, వెండిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉండగా, దీన్ని 5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. దీనికి అదనంగా విధిస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకం (ఏఐడీసీ)ని 5% నుంచి 1 శాతానికి పరిమితం చేశారు. అంటే మొత్తం కస్టమ్స్‌ సుంకం 6 శాతమే అవుతుందని బులియన్‌ అసోసియేషన్లు తమ వర్తకులకు సమాచారం ఇచ్చాయి. దీనిపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో మాత్రం మార్పులు చేయలేదు. ఇది 3 శాతంగానే ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us