Gold Price: బంగారం ధర ఎందుకు తగ్గింది.? ఎప్పటివరకు ఇలా ఉంటుంది.?
5 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతూ.. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6%కి తగ్గించినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జులై 23 నుంచి దేశంలో బంగారం ధరలు క్షీణిస్తూ వస్తున్నాయి. మరోవైపు చైనాలో ఈ పసుపు లోహానికి డిమాండ్ తక్కువగా ఉండటంతో భౌతిక బంగారానికి భారీ నష్టం కలిగించిందని, దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు.
5 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతూ.. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6%కి తగ్గించినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జులై 23 నుంచి దేశంలో బంగారం ధరలు క్షీణిస్తూ వస్తున్నాయి. మరోవైపు చైనాలో ఈ పసుపు లోహానికి డిమాండ్ తక్కువగా ఉండటంతో భౌతిక బంగారానికి భారీ నష్టం కలిగించిందని, దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో US ద్రవ్యోల్బణం డేటా వెలువడిన తర్వాత బంగారం ధరలు పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధోరణులు, దేశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
ఇక మన దేశంలో ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం తప్పనిసరిగా కొంటారు. ఈ క్రమంలో బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. వినియోగదారులకు ధరల తగ్గుదల ఇప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. తక్కువ ఖర్చులు అలాగే 2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం అనడంలో సందేహం లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.