Gold Investment: మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బంగారం అంటే అందరికీ మక్కువే. ప్రస్తుత కాలంలో బంగారాన్ని కేవలం నగలు, ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడికి మంచి సాధనంగా చూస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతూ.. మంచి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇటీవల బంగారం రేటు తగ్గుముఖం పట్టడంతో ఇటు బంగారం ప్రియులకు, అటు పెట్టుబడిదారులకు మంచి సమయం అంటున్నారు నిపుణులు. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు 6 మార్గాలను సూచిస్తున్నారు.
బంగారం అంటే అందరికీ మక్కువే. ప్రస్తుత కాలంలో బంగారాన్ని కేవలం నగలు, ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడికి మంచి సాధనంగా చూస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతూ.. మంచి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇటీవల బంగారం రేటు తగ్గుముఖం పట్టడంతో ఇటు బంగారం ప్రియులకు, అటు పెట్టుబడిదారులకు మంచి సమయం అంటున్నారు నిపుణులు. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు 6 మార్గాలను సూచిస్తున్నారు.
గడిచిన నాలుగైదు రోజుల్లో తులం బంగారంపై 5 నుంచి 6 వేల వరకూ తగ్గింది. ఇప్పటికే 24 క్యారెట్ ధర రూ.70 వేల దిగువకు, 22 క్యారెట్ రేటు రూ.63 వేల దరిదాపుల్లోకి వచ్చింది. అయితే ధరలు ఇంకా తగ్గుతాయన్న అంచనాల నడుమ ఇన్వెస్టర్లు అతిగా వేచి చూసే ధోరణిని అవలంభించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వీలున్నంత మేర కొనుగోళ్లకు దిగడమే ఉత్తమమన్న అభిప్రాయాలనూ కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ రకాల పెట్టుబడి సాధనాలను పరిశీలించాలని సలహా ఇస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టాలనే కోరిక ఉన్నవారు ఆభరణాల కొనుగోళ్లతోనూ ముందుకెళ్లవచ్చు. అయితే హాల్‌మార్క్‌తోపాటు తయారీ, తరుగు, ఇతరత్రా ఖర్చులన్నింటినీ చూసుకొని కొనడం వల్ల లాభాలను పెంచుకోవచ్చు. అయితే నగ డిజైన్‌ను బట్టీ దాని ధర మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
గోల్డ్ కాయిన్స్ కూడా పెట్టుబడికి అనువైనవే. నగల వర్తకులు, బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ లు, చివరకు ఈ-కామర్స్ సంస్థలూ అమ్ముతున్నాయి. గోల్డ్ కాయిన్లు, కడ్డీలు 24 క్యారెట్, 99.9 స్వచ్ఛతతో ఉంటాయి. అన్ని నాణేలు, కడ్డీలపై బీఐఎస్ ప్రమాణాలతో కూడిన హాల్‌మార్క్ ఉంటుంది. నకిలీ, మోసం, డ్యామేజీకి తావు లేకుండా ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌తో ఉన్న నాణేలను కొనాలి. అర గ్రాము నుంచి 5 తులాలదాకా బరువున్న నాణేలు దొరుకుతాయి. మీ వీలునుబట్టి కొనవచ్చు. అలాగే, గత కొన్నేండ్లుగా చాలామంది జ్యుయెల్లర్స్ గోల్డ్ సేవింగ్స్ స్కీములను తెస్తున్నారు. ప్రతీ నెలా కొంత మేర నగదును మీరు సదరు వ్యాపారి వద్ద డిపాజిట్ చేస్తే.. నిర్ణీత కాలపరిమితి తర్వాత దానికి సమాన విలువైన బంగారాన్ని తీసుకోవచ్చు. పేరున్న సంస్థల్లో ఈ స్కీములను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవచ్చు.
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌నే గోల్డ్ ఈటీఎఫ్‌లుగా పిలుస్తున్నారు. ఈ లావాదేవీలు బాంబే స్టాక్ ఎక్సేంజ్ , నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ల్లో ప్రధానంగా జరుగుతాయి. సిప్‌లు, స్టాక్ బ్రోకర్లు, డీమ్యాట్ ఖాతాల ద్వారా ట్రేడింగ్‌కు, పెట్టుబడులకు దిగవచ్చు. కనీసం 1 గ్రాము పెట్టుబడిగా పెట్టాలి. అలాగే సావరిన్ గోల్డ్ బాండ్ల ను ప్రభుత్వం జారీ చేస్తుంది. కాబట్టి వీటిని సురక్షిత పెట్టుబడులుగానే పరిగణించవచ్చు. ఇన్వెస్టర్లు డిజిటల్ గోల్డ్‌నూ పరిశీలించవచ్చు. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్‌ల ద్వారా కొనవచ్చు. MMTC, PAMPలతో ఇవి టైఅప్ అయ్యి ఉంటాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.