ఫార్ములా-E రేస్ కేస్లో మాజీమంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ..ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ క్వాష్ పిటిషన్ని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కొట్టి వేసింది. వాదనల సమయంలో నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాది కోరారు.