ఫార్ములా ఈ రేస్ కేసులో టాప్ గేర్‌లో ఎంక్వైరీ.. విచారణలో సంచలనాలు వెల్లడి!
ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ ఊపందుకుంది. ఓ వైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ వేగం పెంచాయి. కేసులో నిందితులుగా ఉన్న అధికారులను వరుసగా విచారిస్తోంది. హెచ్ఎండీఏ అధికారి బీఎల్‌ఎన్ రెడ్డిపైనా ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు కేటీఆర్ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. ఇక మరోవైపు ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది.
తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తోన్న ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ రేస్ ఎంక్వైరీపైనే ఏసీబీ, ఈడీ ఆఫీసులు ఫుల్ ఫోకస్ పెట్టాయి. నిందితులుగా ఉన్న అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. డబ్బుల బదిలీలో కీలకంగా వ్యవహరించిన బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. ఫెమా ఉల్లంఘన, మనీలాండరింగ్ కోణంలోనే విచారణ జరిగింది. ఎఫ్‌ఈవో కంపెనీకి డాలర్లలో చెల్లించేందుకు ఆర్‌బీఐ అనుమతి తీసుకోకపోవడంపై ఈడీ ఫోకస్ పెట్టింది. అనుమతులు లేకుండా 55 కోట్లు ఎఫ్ఈఓకి బదిలీ చేయడంపై ఈడీ ఆరా తీసింది.
అయితే తమకున్న పరిధిలోనే డబ్బులను బదిలీ చేశామని ఈడీ ముందు హెచ్ఎండీఏ అధికారి బీఎల్ఎన్ రెడ్డి చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతితోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా డబ్బులు బదిలీ చేసినట్టు ఈడీకి సమాచారం ఇచ్చారు బీఎల్ఎన్ రెడ్డి. 46 కోట్ల రూపాయలను విదేశీ మారక దవ్యం రూపంలో చెల్లించినట్టు ఈడీ ముందు స్పష్టం చేశారు. రెండవ దఫా రేసింగ్‌కు ఆటంకం లేకుండా ఉండేందుకు చెల్లింపులు చేశామని ఈడీ ముందు బీఎల్ఎన్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చారు. రెండవ దఫా రేసింగ్ అడ్వాన్స్ చెల్లించకపోతే రేసు రద్దయ్యే అవకాశం ఉండటంతోనే డబ్బులు చెల్లించామని ఈడీ ముందు స్టేట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. రేస్ సక్రమంగా నిర్వహించేందుకు స్పాన్సర్ లేకపోవడంతో HMDAనే రంగంలో దిగి డబ్బులు చెల్లించింనట్టు ఈడీ ముందు బీఎల్ఎన్ రెడ్డి వివరించారు.
ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏ2గా ఉన్న అరవింద్‌కుమార్‌ను ఏసీబీ విచారించింది. గతంలో పురపాలక శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న అరవింద్.. అగ్రిమెంట్ సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో దానకిషోర్ స్టేట్‌మెంట్ ఆధారంగా అరవింద్‌ను ఏసీబీ విచారించింది. హైదరాబాద్‌లో సీజన్ 2 నిర్వహణ కోసం HMDAపై అదనపు భారం ఎందుకు మోపారు? గవర్నర్ అనుమతి లేకుండా మొదటి అగ్రిమెంట్‌ను ఎందుకు రద్దు చేశారు? రెండో అగ్రిమెంట్ చేసుకునే సమయంలో కాంపిటెంట్ అథారిటీకి ఎందుకు చెప్పలేదు? ఎన్నికల కోడ్ అమల్లో సమయంలో అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారు? HMDA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో పాటు ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? వంటి ప్రశ్నలను అరవింద్ కుమార్‌పై ఏసీబీ సంధించింది.
ఇక ఈ కేసులో కేటీఆర్ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. క్వాష్ పిటిషన్‌పై హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు విచారణపై హైకోర్ట్‌లోనూ పిటిషన్లు వేశారు. ఈ కేసులో ఓవైపు కేటీఆర్ న్యాయపోరాటం, మరోవైపు విచారణ జరుగుతుండగానే.. కేటీఆర్‌పై ఏసీబీతో పాటు ఈడీకి మరో ఫిర్యాదు వచ్చింది. ORR అక్రమాలపై విచారణ జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. ORRలో 7 వేల 380 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించింది. ఇందులో KTR పాత్రపై విచారణ చేయాలని కోరింది. ORR టోల్ లీజ్‌పై క్విడ్‌ప్రోకో జరిగిందని ఆరోపించింది. BRS ఎలక్టోరల్ బాండ్స్‌పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలనీ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాలసీ నిర్ణయాలపై దర్యాప్తు జరపాలనీ బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. కేటీఆర్‌తో పాటు కేసీఆర్‌పైనా ఫిర్యాదు చేసింది బీసీ పొలిటికల్ జేఏసీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..