Vijay Deverakonda: మీకు కూడా ఇలా కాల్స్, మెసేజ్‌లు వస్తాయి జాగ్రత్త.. విజయ్ వీడియో వైరల్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది ఖుషితో సూపర్ హిట్ అందుకున్నఅతను ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌తో అభిమానులను మెప్పించాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్న నూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. అలాగే తనకు ట్యాక్సీవాలా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లోనూ ఒక సినిమా చేస్తున్నాడు.

Vijay Deverakonda: మీకు కూడా ఇలా కాల్స్, మెసేజ్‌లు వస్తాయి జాగ్రత్త.. విజయ్ వీడియో వైరల్
Vijay Devarakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 08, 2025 | 6:12 PM

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలన్నీ నిరాశపరచడంతో.. ఆచితూచి అడుగులేస్తున్నాడు విజయ్. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు విజయ్. అప్పుడెప్పుడో వచ్చిన గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియోను షేర్ చేశాడు. తన స్నేహితుడికి జరిగిన సంఘటనను చెప్తూ ఓ వీడియోను పంచుకున్నాడు. అంతేకాదు మీకు కూడా ఇలాగే జరుగుతుందని, జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించాడు.

ఇది కూడా చదవండి : 8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

విజయ్ మాట్లాడుతూ.. “ఇటీవల అతని స్నేహితుల్లో ఒకరి అన్నోన్ కాల్ వచ్చింది. నేను మీ నాన్న దగ్గర 5000 రూపాయలు తీసుకున్నాను, తిరిగి పంపించాలి, ఫోన్ పే ద్వారా పంపిస్తాను అని చెప్పాడు. దానికి విజయ్ దేవరకొండ స్నేహితుడు ఓకే చెప్పాడు. ఆ తర్వాత కొంత సమయం తర్వాత విజయ్ స్నేహితుడి ఖాతాలో 50 వేల రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఇంతకు ముందు ఫోన్ చేసిన వ్యక్తి మళ్ళీ కాల్ చేసాడు, 5000 పంపే బదులు మరో సున్నా నొక్కి 50 వేలు పంపాను. 45 వేల రూపాయలు తిరిగి ఇవ్వాలని చెప్పాడు. నేను నా భార్యను ఆసుపత్రిలో చేర్చాను,  నాకు ఆ డబ్బు చాలా అవసరం. వెంటనే డబ్బులు పెట్టాలని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

అయితే అది జరిగినప్పుడు విజయ్ అక్కడే ఉన్నాడట. విజయ్ తన ఫ్రెండ్ ను ఆ డబ్బులు సెండ్ చేయకుండా ఆపేశాడట.  ఒక్కసారి నీ బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ చెక్ చేసుకో, ఆ డబ్బు నీ అకౌంట్ లో పడితేనే సెండ్ చెయ్ అని చెప్పాడట. వెంటనే  విజయ్  స్నేహితుడు బ్యాంకు ఖాతాను చెక్ చేయగా అదులో అతను పంపిన డబ్బులు లేవు.. అది ఫేక్ మెసేజ్. అలా చూస్కోకుండా అతను డబ్బులు రీ సెండ్ చేసి ఉంటే తన ఖాతాలో డబ్బులు పోయేవి. ఇది చాలా పెద్ద మోసం.

ఇది కూడా చదవండి : కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..! దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురు గత్తర లేపిందిగా..!

మీకు కూడా ఇలాంటి కాల్స్, మెసేజ్‌లు వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి అని విజయ్ ఈ సంఘటనతో చెప్పాడు. కొంతమంది స్కామర్‌లు ఫేక్ క్రెడిట్ మెసేజ్ లాగా పంపుతారు, ఆపై మీకు కాల్ చేసి, మీ అకౌంట్‌లో డబ్బుని తిరిగి వేయమని అడుగుతారు. మెసేజ్ వస్తే డబ్బు వచ్చిందని డబ్బులు రీ సెండ్ చేయకండి, బ్యాంక్ స్టేట్ మెంట్ చూసుకున్నాకే  డబ్బులు రీ సెండ్ చేయాలి అని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. వీడీ 12 సినిమా చిత్రీకరణ జరుగుతోంది. విజయ్ నటించిన ‘ఫ్యామిలీ మేన్’, ‘లైగర్’, ‘ఖుషి’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అంతకు ముందు ‘టాక్సీ వాలా’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘నోటా’ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .