Chhotu Baba: మహా కుంభలో ప్రధాన ఆకర్షణగా చోటూ బాబా.. 32 ఏళ్లుగా స్నానం చేయని సన్యాసిని చూసేందుకు ఆసక్తి..

ప్రయాగరాజ్ లోని మహా కుంభ మేళాకు సర్వం సిద్ధమయింది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభ సమయంలో త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు యాత్రికులు, సాధువులు, అఘోరాలు ప్రయాగరాజ్ కి చేరుకుంటున్నారు. కుంభ మేళా జరిగే ప్రాంతాల్లో మాత్రమే కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాదుసంతనులతో సందడి నెలకొంది. అయితే ఈ అద్భుత కుంభమేళా 2025లో 7 ఏళ్ల సన్యాసి ఛోటు బాబా భక్తులను ఆకట్టుకుంటున్నాడు. 32 ఏళ్లుగా స్నానం చేయని బాబా గురించి తెలుసుకోండి..

Chhotu Baba: మహా కుంభలో ప్రధాన ఆకర్షణగా చోటూ బాబా.. 32 ఏళ్లుగా స్నానం చేయని సన్యాసిని చూసేందుకు ఆసక్తి..
Chhotu Baba
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2025 | 5:48 PM

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరిగే మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అద్భుతమైన మతపరమైన సమావేశం. ఈనెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక జాతరలో ఓ బాబా ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతనే చోటూ బాబా.. అస్సాంలోని కామాఖ్య పీఠ్‌కు చెందిన 57 ఏళ్ల సన్యాసి ఛోటూ బాబా యాత్రికుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ చోటూ బాబా గత మూడు దశాబ్దాలుగా స్నానం చేయలేదు.

ఈ బాబా కేవలం 3 అడుగుల 8 అంగుళాల ఎత్తుఉంటారు. గంగాపురి మహారాజ్ అని కూడా పిలువబడే ఛోటూ బాబా.. మహా కుంభ ఉత్సవానికి హాజరయ్యే భక్తులను, సందర్శకులను ఆకర్షిస్తున్నారు. ఈ చోటూ బాబా గత 32 సంవత్సరాలుగా స్నానానికి దూరంగా ఉన్నాడు. అసాధారణ ప్రతిజ్ఞ చేసి నెరవేరని కోరికతో ఇలా స్నానం చేయకుండా ఉండిపోయారు. అయితే చోటూ బాబా ఆధ్యాత్మిక నిబద్ధత చాలా మందిని ఆకట్టుకుంటుంది.

తన అసాధారణ జీవనశైలితో అందరినీ ఆకట్టుకున్న ఛోటూ బాబా త్వరలో జరగనున్న మహా కుంభమేళాలో భాగమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కుంభలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులను, సాధువులను చూడడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

చోటూ బాబాని చూసేందుకు.. ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు చోటూ బాబా దగ్గరకు చేరుకుంటున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు జరగనున్న మహా కుంభమేళాకు దేశవ్యాప్తంగానే కాదు విదేశాల నుంచి కూడా మిలియన్ల మంది యాత్రికులు వస్తారని భావిస్తున్నారు. భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మహా కుంభకు హాజరైన వారందరికీ అందమైన అనుభవాన్ని అందించడానికి, సురక్షితంగా ఉండేందుకు అదనపు సిబ్బంది, అధునాతన సాంకేతికతతో సహా బలమైన భద్రతా అధికారులు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.