సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. రేవతి భర్తకు ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని చెప్పారు. పోలీసుల అనుమతితో అల్లు అర్జున్ మంగళవారం ఉదయం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు.