- Telugu News Photo Gallery Cinema photos Kiara Advani says that her path is separate from other actresses
అందరి దారి ఒకటైతే.. నా దారి మాత్రం సెపరేట్ అంటున్న కియారా
పుష్పరాజ్ రావడం.. అన్ని రికార్డులను తన పేరు మీద రాసుకోవడం, వరల్డ్ ఫేమస్ కావడం.. అన్నీ జరిగిపోయాయి. అయినా ఇంకా శ్రీవల్లిని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు ఇండస్ట్రీ జనాలు. పుష్ప సీక్వెల్ ప్రమోషన్లకు శ్రీవల్లి చేసిన సపోర్ట్ సూపర్ అంటున్నారు. సంక్రాంతి రేసులో ఉన్న హీరోయిన్లకు.. శ్రీవల్లిని చూపించి సలహాలు కూడా చెప్పేస్తున్నారండోయ్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jan 08, 2025 | 6:31 PM

పుష్పరాజ్ రావడం.. అన్ని రికార్డులను తన పేరు మీద రాసుకోవడం, వరల్డ్ ఫేమస్ కావడం.. అన్నీ జరిగిపోయాయి. అయినా ఇంకా శ్రీవల్లిని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు ఇండస్ట్రీ జనాలు. పుష్ప సీక్వెల్ ప్రమోషన్లకు శ్రీవల్లి చేసిన సపోర్ట్ సూపర్ అంటున్నారు. సంక్రాంతి రేసులో ఉన్న హీరోయిన్లకు.. శ్రీవల్లిని చూపించి సలహాలు కూడా చెప్పేస్తున్నారండోయ్.

ముంబై అంటే ముంబైకి, చెన్నై అంటే చెన్నైకి... పుష్పరాజ్ అంత ఫాస్ట్ గా ప్రమోషన్లు చేయడానికి..ముందుకు దూకేశారు సిల్వర్‌స్క్రీన్ శ్రీవల్లి రష్మిక మందన్న.

ఆమెతో పోలిస్తే, కియారా అద్వానీ కాస్త స్లో అయ్యారా? గేమ్ చేంజర్ ప్రమోషన్లకు డుమ్మా ఎందుకు కొడుతున్నట్టు అనే మాటలు మొదలయ్యాయి. గేమ్ చేంజర్ టీమ్ ఎక్కడ ల్యాండ్ అయినా, వాళ్ల వెంటే వాలిపోతున్నారు అంజలి.

హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనూ, పవర్‌స్టార్ ముఖ్య అతిథిగా వచ్చిన ప్రీ రిలీజ్‌లోనూ జోష్‌గా కనిపించారు అంజలి. అక్కడ కియారా యాబ్సెన్స్ కొట్టొచ్చినట్టు కనిపించిందంటున్నారు క్రిటిక్స్.

అటు సంక్రాంతికి వస్తున్నాం భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కూడా యాక్టివ్‌గానే కనిపిస్తున్నారు. డాకు మహారాజ్ యూఎస్ ఈవెంట్లో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఫర్‌దర్‌గా కూడా ఇంతే యాక్టివ్‌గా ఉండాలన్నది ఫ్యాన్స్ మాట.

సినిమాకు కాల్షీట్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, యూనిట్‌కి తమ వంతు సపోర్ట్ చేయాలని, పుష్ప సక్సెస్ చూసిన తర్వాతైనా మిగిలిన హీరోయిన్లు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు బాగానే వినిపిస్తున్నాయి.