AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరి నీ దుంపతెగా.. ఎంత అందంగా ఉంటే మాత్రం భార్యను పక్కన పెట్టి అత్తను పెళ్లాడతారా..

ఈ భూమ్మీద ఏడ లేని సరుకంతా ఈ చిత్తూరు జిల్లా అడవుల్లోనే ఉందప్పా అని పుష్పా చెప్పినట్టే.. జనాలకు ప్రపంచంలో ఏడా దొరకని క్రైమ్‌ అంతా ఒక్క యూపీలోనే దొరుకుతుంది. చిత్ర విచిత్ర సంఘటనలు అన్ని ఇక్కడే కనిపిస్తాయి. తాజాగా అలాంటి ఓ ఘటనే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందేంటో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Viral Video: ఓరి నీ దుంపతెగా.. ఎంత అందంగా ఉంటే మాత్రం భార్యను పక్కన పెట్టి అత్తను పెళ్లాడతారా..
Manmarriesmotherinlaw
Anand T
|

Updated on: Jun 08, 2026 | 4:53 PM

Share

ప్రపంచంలో ఎక్కడ జరగని చిత్ర విచిత్ర సంఘటనలన్నీ.. యూపీలోనే వెలుగు చూస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి తెరపైకి వచ్చింది. అత్తంటే తల్లి తర్వాత తల్లి అంటారు. కానీ ఇక్కడో వ్యక్తి ఏకంగా భార్య తల్లినే పెళ్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అవును వినడానికి వింతగా అనిపించినా ఇది వాస్తవం. వీరిద్దరూ కోర్టు సమక్షంలోనే పెళ్లి చేసుకొని దండలు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నివేదికల ప్రకారం.. యూపీకి చెందిన ఓ వ్యక్తికి కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లైన తర్వాత అతడు భార్య తల్లితో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కూడా అల్లుడికి సహకరించడంతో ఇద్దరూ కొన్నాళ్ల పాటు వ్యవహారం నడిపించారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఇక నేరుగా కోర్టుకు వెళ్లి అక్కడే పెళ్లి చేసుకొని దండలు మార్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక పెళ్లి తర్వాత చేతిలో మ్యారేజ్ సర్టిఫికేట్ పట్టుకుని కెమెరాకు ఫోజులు ఇచ్చారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇవి కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సమాజం ఎటు పోతోంది అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే, మరికొందరు ఇది నిజమేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వింత వ్యవహారంపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నప్పటికీ.. పోలీసులకు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

ఇదిగో వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us