AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: కర్రీలో కారం ఎక్కువైందా?.. ఈ చిన్న చిట్కాతో క్షణాల్లో తగ్గించండి

వంట చేసేటప్పుడు హడావుడిలో కూరలో కారం, కానీ మసాలాలు కాని ఎక్కువ వేశారా? దాన్ని తినలేక పోతున్నారా? దాన్ని పడేద్దాం అనుకుంటున్నారా?.. ఆగండి మీ కిచెన్‌లోనే ఉన్న కొన్ని పదార్థాలను ఉపయోగించే కర్రీలో కారాన్ని క్షాణాల్లో తగ్గించవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

Kitchen Tips: కర్రీలో కారం ఎక్కువైందా?.. ఈ చిన్న చిట్కాతో క్షణాల్లో తగ్గించండి
How To Fix Overly Spicy Curry
Anand T
|

Updated on: Jun 01, 2026 | 5:07 PM

Share

వంట చేయడం అనేది ఒక ఆర్ట్‌. ఎంత ఫర్‌ఫెక్ట్‌గా చేసేవాళ్లైనా సరే వంటలో కొన్ని సార్లు తప్పులు చేస్తుంటారు. చాలాసార్లు, వండేటప్పుడు, తొందరపాటు వల్ల లేదా కంగారు వల్ల, కారమో లేదా ఉప్పో ఎక్కువగా వేసేస్తారు. ఇది కూడా రుచిని మొత్తం పాడు చేస్తుంది. మొదటి ముద్ద తినగానే నోరు మండిపోతుంది. దీంతో దాన్ని తినలేక చాలా మంది పాడేయాలి అనుకుంటారు. కానీ ఇలా చేయకుండా ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో కూరలో కారాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలానో చూద్దాం.

కూరలో కారాన్ని తగ్గించడం ఎలా?

పెరుగు లేదా క్రీమ్ కలపండి: మీరు కర్రీలో కారాన్ని తగ్గించాలి అనుకుంటే మీకు పెరుగు బెస్ట్ ఆప్షన్. మీరు చేసిన కూర లేదా గ్రేవీ మరీ కారంగా ఉంటే అందులో కొద్దిగా పెరుగును కలపండి. ఇది కర్నీలోని కారాన్ని తగ్గించి రుచిని సమతుల్యం చేస్తోంది. అలాగే దానికి తేలికపాటి క్రీమీ రుచి వస్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే.. పెరుగు విరిగిపోకుండా ఉండేందుకు, దాన్ని కర్రీలో కలిపేప్పుడు మంటను తక్కువగా ఉంచండి.

బంగాళదుంపలు: కర్రీలోని కారాన్ని తగ్గించేందుకు ఇది కూడా బెస్ట్ ఆప్షన్. మన ఇంట్లో ఉన్న ఆలుగడ్డతో ఈజీగా కర్రీలోని కారం, ఉప్పును తగ్గించవచ్చు. ఎలా అంటే మీరు వండిన కూరలో కారం ఎక్కువైతే అందులో ఒక ఆలుగడ్డను వేసి కాసేపు ఉడికించండి. తర్వాత దాన్ని తీసేయండి. ఇది కారం, ఉప్పును పీల్చుకుని రుచిని సరి చేస్తుంది.

నిమ్మరసం: మీ వండిన కూరలో కారాన్ని తగ్గించేందుకు నిమ్మరసం కూడా బాగా పని చేస్తుంది. కర్రీలో కారం ఎక్కువైతే అందులో కొంచెం నిమ్మరసాన్ని కలపండి. ఇది కారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దానిలోని తేలికపాటి పులుపు రుచిని సమతుల్యం చేస్తుంది. ఈ పద్ధతి ముఖ్యంగా పప్పు, చాట్ లేదా కారంగా ఉండే కూరగాయల విషయంలో బాగా పనిచేస్తుంది.

తీపి పదార్థాలు: మీ ఆహారం మరీ కారంగా ఉంటే, అందులో కొద్దిగా తేనె, పంచదార లేదా బెల్లం కలపండి. ఈ పదార్థాలలోని తీపి.. కారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ మరీ ఎక్కువగా కలపొద్దు, ఎందుకంటే దీనివల్ల ఆహారం మరింత తీపిగా అనిపిస్తుంది.అప్పుడు కూర టేస్ట్ మొత్తం మారిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!