AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ట్రైన్ టికెట్లపై చిన్న రంధ్రాలు ఎందుకుంటాయి..? హవ్వా.. అసలు సీక్రెట్ ఇదా..

మీరు పాత రోజుల్లో ట్రైన్ టికెట్ చూస్తే.. టికెట్‌పై రెండు వైపులా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. అయితే కాగితంపై ఈ రెండు రంధ్రాలు ఎందుకు అనే డౌట్ ప్రతీఒక్కరికీ వచ్చే ఉంటుంది. అయితే ఈ రంధ్రాల వెనుక పెద్ద కారణమే ఉందట.

Venkatrao Lella
|

Updated on: Jun 08, 2026 | 6:22 PM

Share
ప్రతీఒక్కరూ ఎప్పుడో ఒకసారి రైళ్లల్లో ప్రయాణం చేసి ఉంటారు. కౌంటర్ దగ్గరకు వెళ్లి లైన్లో నిల్చోని టికెట్ తీసుకుని ఉండి ఉంటారు. అయితే ట్రైన్ టికెట్‌కి సంబంధించి చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. టికెట్‌పై ఛార్జీ, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అనేవి ముద్రించి ఉంటాయి. అయితే పాత రోజుల్లో  టికెట్‌కు రెండు వైపులా చివరిలో చిన్న రంధ్రాలు ఉండేవి. అసలు ఆ రంధ్రాలు ఎందుకు ఉన్నాయి? అనే అనుమానం చాలామందికి వచ్చి ఉంటుంది. దానికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం

1 / 5
రైలు టికెట్‌పై ఉండే చిన్న రంధ్రాలను చూసి అలంకరణ కోసమో లేదా ఆకర్షణీయమైన డిజైన్ కోసం అని చాలామంది అనుకుంటారు. కానీ దీని వెనుక పెద్ద సీక్రెట్ ఉంది. ఒక పెద్ద సాంకేతిక కారణం ఉంది.  పాత రోజుల్లో టెక్నాలజీ, కంప్యూటర్లు, ప్రింటర్లు అంతగా అందుబాటులో ఉండేవి కాదు. దీంతో రైలు టికెట్లను ముద్రించేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించేవారు. ఈ యంత్రాల కారణంగానే ఈ చిన్న రంధ్రాలు అవసరమయ్యాయి.

2 / 5
వీటిని స్ప్రోకెట్ రంధ్రాలుగా పిలుస్తారు. అప్పట్లో డాట్ మ్యాట్రిక్స్ ప్రింట్లను రైల్వేశాఖ ఉపయోగించేది. టికెట్ల జారీ కోసం వీటిని అభివృద్ది చేశారు. పాత రోజుల్లో టికెట్లను వేర్వేరు పేజీలుగా కాకుండా పొడవైన కాగితంపై ముద్రించేవారు. ప్రింటర్ కాగితాన్ని సరిగ్గా పట్టుకుని ముందుకు కదిలించడానికి వీలుగా ఇరువైపులా రంధ్రాలను కాగితానికి సమాన దూరంలో ఉంచేవారు.

3 / 5
పాత డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు పూర్తిగా యాంత్రికమైనవి. వాటి లోపల చిన్న పళ్ళ చక్రాలు ఉండేవి. ఈ చక్రాలు కాగితం అంచులలోని రంధ్రాలలోకి సరిపోయి కాగితాన్ని ముందుకు లాగేవి. ఈ చిన్న రంధ్రాలు లేకపోతే కాగితం జారిపోయి వంకరగా అయ్యేది. అలా జరిగితే టికెట్‌పై ముద్రించిన సమాచారం సరైన స్థానంలో కాకుండా తప్పుగా ఉండేది. స్ప్రాకెట్ రంధ్రాల కారణంగా కాగితం సరళ రేఖలో కదలడమే కాకుండా ప్రతి టికెట్ సరిగ్గా ముద్రించబడేది.

4 / 5
అయితే ప్రస్తుతం ఆధునిక థర్మల్, డిజిటల్ ప్రింటర్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్త ప్రింటర్లకు కాగితాన్ని కదిలించేందుకు గేర్‌వీల్ వ్యవస్థ అవసరం లేదు. నిరంతరం కదులుతూ ఉండే పొడవైన కాగితపు షీట్ల వాడకం కూడా తగ్గింది. ఫలితంగా టిక్కెట్ల పక్కల ఉండే ఆ చిన్న రంధ్రాలు క్రమంగా కనుమరుగయ్యాయి.

5 / 5
Follow Us