Viral Video: కొంప ముంచావ్ కదరా చిట్టి.. బాలుడిని కడుపులో తన్నేసిన రోబో.. ఇదిగో వీడియో
రోబోల వల్ల మనకు ఉన్న ప్రయోజాలు ఏంటో కాని.. అవి నియంత్రణ తప్పితే జరిగే ప్రమాదాలు ఊహించుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతుంది. తాజాగా అలాంటి ఘటనే చైనాలోని షాంగయ్ నగరంలో వెలుగు చూసింది. హ్యూమనాయిడ్ రోబోల ప్రదర్శనలో ఓ రోబో చిన్నారిపై దాడి చేసిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

మానవుడు సృష్టించిన అద్భుత ఆవిష్కరణ రోబో. దీని వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అదే స్థాయిలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయనేది కాదనలేని సత్యం. తాజాగా చైనాలోని ఓ ఈవెంట్‌లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆ ఈవెంట్‌లో ప్రదర్శన సందర్భంగా ఓ రోబో ఒక చిన్నారి కడుపులో తన్నేసింది. దీంతో ఆ బాలుడు నొప్పితో విలవిలలాడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రోబోల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
వైరల్ వీడియో ప్రకారం.. షింజియాంగ్ నగరంలోని ఉరుమ్‌కీ బొటానికల్ గార్డెన్‌లో ఇటీవల హ్యూమనాయిడ్ రోబోల ఎక్స్‌పోను ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి అనేక రోబోలను తీసుకువచ్చారు. వీటిని వీక్షించేందుకు జనాలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ రోబో మార్షల్ ఆర్ట్స్ చేస్తుండగా.. దాన్ని చూడటానికి అక్కడున్న వారంతా చుట్టూ చేరారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
ఆ రోబో మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ముందుకు వచ్చి, అక్కడ నిల్చున్న ఓ చిన్నారి కడుపులో బలంగా తన్నింది. దీంతో ఆ బాలుడు కడుపు పట్టుకుని అక్కడే కుప్పకూలి విలవిల్లాడాడు. అది చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న కొంతమంది ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. కాగా, ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.
వీడియో చూడండి..
A robot kicked a little boy in the stomach
We’re officially one software update away from Terminatorpic.twitter.com/iO9jv2qUuf
— Mario Nawfal (@MarioNawfal) June 4, 2026
నెటిజన్ల ఆందోళన
మరోవైపు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు రోబోల సాంకేతికతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “మన ప్రయోజనాల కోసం తయారు చేసిన ఈ రోబోలు, ఇప్పుడు మన ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి” అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. “ఇవి గాని చెడ్డవాళ్ల చేతిలోకి వెళ్తే ఇంకెంత ప్రమాదమో!” అని మరికొందరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
