Microwave: మైక్రోవేవ్ జిడ్డుగా మారిందా.. కిచెన్‌లో దొరికే వీటితో క్షణాల్లో కొత్త దానిలా మార్చండి.. ఎలా అంటే?
ఫాస్ట్ లైప్, వర్క్ టెన్షన్ కారణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మందికి వంట చేసుకునే టైం ఉండట్లలేదు. దీంతో ఒక్కసారి చేసుకున్న ఫుడ్‌ను ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకొని.. తర్వాత దాన్నే మైక్రో ఓవెన్‌లో వేడి చేసుకొని తింటున్నారు. అయితే తరచూ ఉపయోగించడం వల్ల మైక్రోవోవెన్ మురికిగా మారుతుంది. అయితే చాలా మందికి దీన్ని ఎలా క్లీన్ చేయాలో తెలియదు. కాబట్టి ఇప్పుడు తెలుసుకుందాం.

శీతాకాలంతో పోలిస్తే వేసవి కాలంలో వంటగది త్వరగా మురికిగా మారుతుంది. దీనివల్ల ఈగలు, పురుగులు, ఇతర కీటకాలు ఇంట్లోకి వస్తుంటాయి. అందుకే వేసవిలో వంటగదిని, అక్కడ ఉపయోగించే వస్తువులను ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చేసుకునే టైం లేక చాలా మంది వండిన ఆహారాన్ని ప్రిజ్‌లో పెట్టుకొని మళ్లీ వేడి చేసుకొని తింటున్నారు. ఇలా ఆహారాన్ని వేడి చేసేందుకు ప్రతి ఇంట్లో మైక్రోవేవ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, మైక్రోవేవ్ క్లీనింగ్ విషయానికి వస్తే చాలామంది దీన్ని ఎలా క్లీన్ చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే మాస్టర్‌షెఫ్ పంకజ్ భదౌరియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కిచెన్ స్పా’ పేరుతో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో మైక్రోవేవ్‌ను సులువుగా, ఎలాంటి శ్రమ లేకుండా నిమిషాల్లో ఎలా శుభ్రం చేసుకోవాలో వివరించారు.
మైక్రోవేవ్ ఎలా క్లీన్ చేయాలి
- మొదట ఒక చిన్న గిన్నెలో మైక్రోవేవ్ సేఫ్ బౌల్ నీళ్లు తీసుకోండి.
- అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండి, ఆ నిమ్మ చెక్కను కూడా ఆ నీటిలోనే వేయండి.
- ఇప్పుడు ఈ గిన్నెను మైక్రోవేవ్‌లో పెట్టి, 2 నిమిషాల పాటు హై మోడ్‌లో రన్ చేయండి.
- సమయం ముగిసిన తర్వాత మైక్రోవేవ్ డోర్ తెరిచి, ఒక శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో లోపలి భాగాలను తుడిచేయండి.
ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది?
నిమ్మకాయ ముక్కలు వేసిన నీరు వేడెక్కినప్పుడు వచ్చే ఆవిరి, మైక్రోవేవ్ లోపల పేరుకుపోయిన మొండి జిడ్డు, ఎండిపోయిన ఆహార మరకలను మెత్తగా చేస్తుంది. దీనివల్ల గుడ్డతో తుడవగానే మురికి చాలా సులువుగా వచ్చేస్తుంది. అంతేకాదు, నిమ్మకాయలోని యాంటీబాక్టీరియల్ గుణాలు మైక్రోవేవ్ నుండి వచ్చే దుర్వాసనను పోగొట్టి, మంచి సువాసనను అందిస్తాయి.
ఈ హోం రెమెడీస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఈ పద్ధతిలో క్లీన్ చేయడం ద్వారా ఎటువంటి ఖరీదైన లేదా హానికరమైన కెమికల్ క్లీనర్స్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఇది చాలా సహజసిద్ధమైన పద్ధతి కాబట్టి మైక్రోవేవ్‌కు ఎలాంటి నష్టం జరగదు, పైగా వంటగది వస్తువులు ఎక్కువ కాలం కొత్తవాటిలా మెరుస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
