Video: ఓపికను టెస్ట్ చేస్తే ఇలాగే ఉంటది.. బుడ్డోడి దూల తీరిపోయిందిగా.. ఇదిగో వీడియో
Viral Gaming Cafe Fight: పిల్లలకు చిన్నతనం నుంచే ఇతరులను గౌరవించడం, క్రమశిక్షణతో మెలగడం నేర్పించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన నిరూపిస్తోంది. ఇంట్లో దొరికే స్వేచ్ఛ బయటి సమాజంలో దొరకదని, మితిమీరిన అల్లరి ఎప్పటికైనా ప్రమాదకరమని ఈ వైరల్ దృశ్యాలు హెచ్చరిస్తున్నాయి.

Boy Provokes Gamer Video: నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ కేంద్రాలు, ఆటల గదులు యువతతో కిటకిటలాడుతుంటాయి. అయితే, అక్కడ కేవలం ఆటలు మాత్రమే కాదు, ఒక్కోసారి ఊహించని జీవిత పాఠాలు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక గేమింగ్ కేఫ్‌లో జరిగిన షాకింగ్ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి, పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.
పదే పదే కవ్వించాడు.. సహనాన్ని పరీక్షించాడు..
సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్న ఆ 32 సెకన్ల విజువల్స్ చూస్తే ఎవరికైనా ఒళ్లు మండిపోవడం ఖాయం. గేమింగ్ కేఫ్ యువకులతో కిక్కిరిసిపోయి ఉంది. అక్కడ ఒక యువకుడు ఎంతో ఏకాగ్రతతో తన కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ ఆటలో మునిగిపోయాడు. అంతలో గులాబీ రంగు చొక్కా వేసుకున్న ఒక చిన్న బాలుడు అక్కడికి వచ్చాడు. ఆడుకుంటున్న యువకుడిని అనవసరంగా చికాకు పెట్టడం ప్రారంభించాడు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు.. పదే పదే ఆ యువకుడి తలపై కొడుతూ, నెడుతూ తీవ్రంగా కవ్వించాడు. తన ఆట పాడవుతున్నా ఆ యువకుడు మొదట చాలా ఓపికగా భరించాడు.
సహనం నశించడంతో..
Bilgisayarda oyun oynayan genç adama defalarca vuran çocuk, erken yaşta insanların sabırlarını sınamaması gerektiğini öğreniyor.
Ailenizin size izin verdiği şımarıklığı dışarıda yapmaya kalktığınızda dünyanın sert tokatıyla tanışırsınız. pic.twitter.com/TDmQdoH5Nf
— Serkan Tanyildizi (@srkntnyldz) June 7, 2026
కానీ ఆ బుడతడు మాత్రం తగ్గేదే లేదన్నట్లు మరింత రెచ్చిపోయాడు. ఎప్పుడైతే సహనం గిరి దాటిందో, అప్పుడు అసలు కథ మొదలైంది. అంతసేపు ఓపికగా ఉన్న ఆ యువకుడు ఒక్కసారిగా సీటులోంచి లేచాడు. క్షణాల్లో ఆ బాలుడిపై విరుచుకుపడ్డాడు. పిడిగుద్దులు, తన్నులతో ఆ చిన్నారికి గట్టి బుద్ధి చెప్పాడు. రూమ్‌లో ఉన్న మిగతా వాళ్లు అడ్డుపడే లోపే ఆ బాలుడికి గట్టి దెబ్బలు పడ్డాయి. ఇంట్లో తల్లిదండ్రులు మితిమీరిన గారాబంతో పెంచడం వల్లే బయటి సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలియక ఆ బాలుడు ఇలాంటి దుస్థితిని తెచ్చుకున్నాడనేది స్పష్టమవుతోంది.
నెటిజన్ల ఆవేదన..
ఈ వీడియోను పంచుకున్న ఒక టర్కీ నెటిజన్ దీనికి ఒక అద్భుతమైన శీర్షికను జోడించారు. “ఇంట్లో తల్లిదండ్రులు గారాబం చేసి క్రమశిక్షణ నేర్పకపోతే, బయటి ప్రపంచం ఎంత కఠినంగా బుద్ధి చెబుతుందో ఈ బాలుడికి చిన్న వయసులోనే అర్థమైంది. ఎదుటివారి సహనాన్ని పరీక్షించకూడదనే చేదు నిజం వాడు తెలుసుకున్నాడు” అని పేర్కొన్నారు. ఈ మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
నెటిజన్ల మధ్య తీవ్ర చర్చోపచర్చలు..
ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. అత్యధిక శాతం మంది ఆ యువకుడి చర్యను సమర్థించారు. “అలాంటి అల్లరి మూకలకు ఇలాంటి గట్టి దెబ్బలు తగిలితేనే బుద్ధి వస్తుంది, ఇది నిజమైన సామాజిక పాఠం” అని కొనియాడారు. అయితే, మరికొందరు మాత్రం ఆ యువకుడి ఆగ్రహాన్ని తప్పుపట్టారు. చిన్న పిల్లాడిని అంత దారుణంగా తన్నడం సరికాదని, సదరు యువకుడికి కోపాన్ని అదుపులో ఉంచుకునే మానసిక చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
