Viral Video: నీటిలో జింకను వేటాడబోయిన మొసలి.. కట్ చేస్తే.. క్లైమాక్స్ అదుర్స్!
సముద్రపు అలెగ్జాండర్‌గా పేరున్న మొసలి వేటాడితే.. అంతే సంగతులు. నీళ్లలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉందని అంటారు.

సముద్రపు అలెగ్జాండర్‌గా పేరున్న మొసలి వేటాడితే.. అంతే సంగతులు. నీళ్లలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉందని అంటారు. అందుకే నీటిలో వాటికి దొరికిన ఏ జంతువు కూడా ప్రాణాలతో బయటికి రాదు. అయితే ఇక్కడ సీన్ కాస్తా రివర్స్ అయింది. నీటిలో ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్తున్న జింకను చూసిన మొసలి.. దాన్ని వేటాడాలని అనుకుంటుంది. అయితే చివర్లో క్లైమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో ఎండ్ అవుతుంది. అదేంటో చూసేద్దాం..
వీడియో ప్రకారం.. ఓ జింక(Antelope) ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్తుండగా.. మార్గం మధ్యలో మొసలి దాన్ని గమనిస్తుంది. వెంటనే ఆ జింకను వేటాడటానికి వేగంగా ఈదుకుంటూ వెళ్తుంది. జింకకు అతిదగ్గరగా వచ్చిన మొసలి.. దాని బలమైన దంతాలతో ఒక్కసారిగా మింగేయాలని చూస్తుంది. సీన్ కట్ చేస్తే.. వచ్చే ప్రమాదాన్ని ముందే గ్రహించిన జింక.. అతివేగంతో దాని బారి నుంచి తప్పించుకుని క్షేమంగా ఒడ్డుకు చేరుతుంది. ఈ వీడియోను డైరెక్టర్ వినోద్ కాప్రి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 50 సెకన్ల నిడివి ఉన్న దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘వావ్.! వాట్ ఏ టాప్ క్లాస్ క్లైమాక్స్’ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
A TOP class climax ! ? pic.twitter.com/17jDM9cNpY
— Vinod Kapri (@vinodkapri) February 6, 2023
