Viral Video: లైక్స్ కోసం రీల్స్ .. బైక్‌తో రైలు ఇంజిన్‌ను లాగేందుకు ప్రయత్నించిన యువకుడు.. కట్ చేస్తే..
రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఈ ప్రమాదకరమైన విన్యాసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో యువకుడు తన బైక్‌ను రైలు ఇంజిన్‌కు తాడుతో కట్టివేయడాన్ని చూడవచ్చు. ఆ తర్వాత రైల్వే ట్రాక్‌పై తన బైక్‌ను ఉపయోగించి రైలును లాగడానికి ప్రయత్నించాడు. రైలు ఇంజిన్‌కు తన బైక్‌ను కట్టివేసి ప్రమాదకరమైన విన్యాసం చేశాడు.
రీల్స్ సంస్కృతి దేశంలోని మారుమూల ప్రాంతాలకు విస్తరించింది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి గ్రామాల్లోని యువతకు కూడా రీళ్లు, వీడియోల ఫీవర్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ఈ యువకులు రీల్స్ చేసే లైక్‌లు, షేర్ల కోసం ఎంతదురానికైనా వెళ్తున్నారు. వీడియోలు, రీల్స్‌ను రూపొందించాలనే అభిరుచితో చేస్తున్న పనులతో చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆగి ఉన్న రైలు ముందు రైలు పట్టాలపై ఒక యువకుడు వింత విన్యాసం చేస్తూ కనిపించాడు. రైల్వే ట్రాక్‌పై బైక్‌తో రైలు ఇంజిన్‌ను లాగేందుకు ప్రయత్నించిన యువకుడిపై కేసు నమోదైంది.
రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఈ ప్రమాదకరమైన విన్యాసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో యువకుడు తన బైక్‌ను రైలు ఇంజిన్‌కు తాడుతో కట్టివేయడాన్ని చూడవచ్చు. ఆ తర్వాత రైల్వే ట్రాక్‌పై తన బైక్‌ను ఉపయోగించి రైలును లాగడానికి ప్రయత్నించాడు. రైలు ఇంజిన్‌కు తన బైక్‌ను కట్టివేసి ప్రమాదకరమైన విన్యాసం చేశాడు.
సోషల్ మీడియాలో లైక్‌లు, సబ్‌స్క్రైబర్‌ల కోసం యువకుడు తన జీవితాన్ని పణంగా పెట్టి రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా బైక్‌పై విన్యాసాలు చేస్తున్నాడు. వైరల్ వీడియో చూసిన పోలీసులు రైల్వే ట్రాక్‌పై ఈ ప్రమాదకరమైన విన్యాసాలు చేసినందుకు యువకుడిపై ఫిర్యాదు నమోదు చేశారు. డియోబంద్‌లోని మజోలా గ్రామానికి చెందిన విపిన్ కుమార్ అనే యువకుడిని అరెస్టు చేశారు. అయితే ఈ వీడియో పాతదని వాదిస్తున్నారు.
सहारनपुर
➡रेलवे ट्रैक पर खड़े इंजन को बाइक से खींचने की कोशिश
➡वायरल वीडियो में युवक अजीबोगरीब कारनामा करता दिखा
➡बाइक से युवक ट्रेन के इंजन को खींचने की कोशिश कर रहा
➡रील बनाने के लिए लोग कुछ भी कर गुजरने को तैयार हैं
➡बाइक से रेल का इंजन खींचने का वीडियो हो रहा… pic.twitter.com/wJL8krDTYY
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) September 12, 2024
డియోబంద్-రూర్కీ రైల్వే లైన్‌లో జరిగిన ఈ ఘటనపై ముజఫర్‌నగర్ జిఆర్‌పి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ విషయానికి సంబంధించి ఎవరినీ అరెస్టు చేసినట్లు నివేదికలు లేవు. ఈ ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్నప్పుడు యువకుడికి తీవ్ర గాయాలై ఉండవచ్చు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి రీళ్లు తయారు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..