Viral: వీడెవడండీ బాబూ.! కొడుక్కి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడు.. చివరికి జరిగిందిదే

అదేంటి.. లేటు వయసులో ప్రేమించకూడదా? ఎందుకు కూడదు.. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేనప్పుడు ఎంచక్కా ప్రేమించుకోవచ్చు. సమాజం ఏమనుకుంటే నాకెందుకు అనే ధోరణిలో ఉన్నప్పుడు ముందువెనక చూడకుండా లవ్వాడొచ్చు. ఇప్పుడు ఓ పెద్ద మనిషి ఓ అమ్మాయిపై మనసుపడ్డాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Viral: వీడెవడండీ బాబూ.! కొడుక్కి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడు.. చివరికి జరిగిందిదే
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 14, 2025 | 5:09 PM

అదేంటి.. లేటు వయసులో ప్రేమించకూడదా? ఎందుకు కూడదు.. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేనప్పుడు ఎంచక్కా ప్రేమించుకోవచ్చు. సమాజం ఏమనుకుంటే నాకెందుకు అనే ధోరణిలో ఉన్నప్పుడు ముందువెనక చూడకుండా లవ్వాడొచ్చు. ఇప్పుడు ఓ పెద్ద మనిషి ఓ అమ్మాయిపై మనసుపడ్డాడు. మరో ముందుడుగేసి ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇందులో అబ్జెక్షన్ ఏముంది అనుకోవచ్చు. కానీ ఈ స్టోరీలో ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడో వ్యక్తి. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిందీ ఘటన. ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఓ అమ్మాయిని చూశాడు. కుమారుడికి కూడా ఆ అమ్మాయి నచ్చడంతో పెళ్లి కుదిరింది. ముహూర్తాలు కూడా నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాల ఇళ్లలోనూ పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది.

వన్ ఫైన్ డే.. పెళ్లి కొడుకు తండ్రి, వధువు ఇద్దరూ సైలెంట్‌గా ఓ గుళ్లో పెళ్లి చేసుకుని ఎంచక్కా ఇంటికొచ్చారు. తనకు కాబోయే భార్యతో పెళ్లి దుస్తుల్లో వచ్చిన తండ్రిని చూసి పెళ్లికొడుకు షాకయ్యాడు. అటు పెళ్లి కుమార్తె ఇంట్లోనూ ఇలాంటి సీనే కనిపించింది. కోపంతో ఊగిపోయిన కుమారుడిని బుజ్జగించేందుకు మరో యువతిని వెతికి పెళ్లి చేస్తానని తండ్రి హామీ ఇచ్చినప్పటికీ అతడు నిరాకరించాడు. ఈ దెబ్బతో తనకు పెళ్లిపైనే నమ్మకం పోయిందని, సన్యాసిగా మారిపోతానని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి