ప్రపంచంలో వర్షం పడని ఒకేఒక్క గ్రామం ఇది !!

Phani CH

19 November 2024

ఇప్పటి వరకు మనం ప్రపంచంలో రకరాల వింతలు చూసి ఉంటాం అలాంటిదే ఈ రోజు  మరొక కొత్త వింత గురించి తెలుసుకుందాం.

వర్షాకాలం అంటే చాలామందికి ఇష్టం.. చాలామందికి ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ప్రపంచంలో ఒకే ఒక గ్రామంలో అసలు వర్షమనేదే పడదు. 

అవును నిజమే ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క వర్షపు చినుకు కూడా పడలేదటే ఆశ్చర్యమే కదా మరి. ఈ గ్రామంలో ఉండేవారిలో మెజార్టీ ప్రజలు అల్ బోహ్రా, అల్ ముకరమా వర్గానికి చెందినవారు.

ఈ గ్రామంలో వర్షపాతం లేకపోయినా పర్యాటకంగా చాలా ప్రసిద్ధి చెందింది. కొండప్రాంతం, చారిత్రాత్మకమైన వాస్తు కళ కారణంగా అద్భుతంగా ఉంటుంది.

ఈ ఊరి ఇళ్లు ప్రాచీనంగా, ఆధునిక శైలిలో ఉంటాయి. అయితే ఈ గ్రామంలో వర్షపాతం ఎందుకు ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ గ్రామం  సముద్రమట్టానికి ఏకంగా 3200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సాధారణంగా మేఘాలు 2000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ మేఘాలు ఊరికి దిగువలో ఉండటం వల్ల వర్షాలుండవు.

యెమెన్ రాజధాని సనాకు కొద్దిదూరంలో ఉంది ఈ ఊరు. అల్ హుతైబ్ గ్రామం కొండపై ఉండే గ్రామం. ఇక్కడ ఇప్పటి వరకూ ఒక్క చినుకు వర్షపాతం కూడా లేదు.