బాబోయ్ డాల్ఫిన్లు ఎంతకాలం జీవిస్తాయో తెలిస్తే షాక్ అవుతారు

Phani CH

09 December 2024

పిల్లలు దగ్గర నుండి పెద్దవారి వరకు డాల్ఫిన్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు.. దీనికి కారణం ఇవి మనుషులతో చాలా ఫ్రెండ్లీ ఉంటాయి.

డాల్ఫిన్ మంచి యాక్టివ్‌గా ఉండే ఒక సముద్ర జీవి.. అయితే ప్రస్తుత కాలంలో డాల్ఫిన్ జాతి అంతరించిపోతుందనేది కూడా వాస్తవం. 

చాలా యాక్టివ్‌గా ఉండే ఈ డాల్ఫిన్స్ ఎంత కాలం జీవిస్తాయో మీకు తెలుసా అయితే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డాల్ఫిన్లు ఎంతకాలం జీవిస్తాయనేది డాల్ఫిన్ జాతిని బట్టి ఉంటుంది. ఒక్కో జాతీ డాల్ఫిన్ జీవితకాలం ఒక్కోలా ఉంటుంది.

డాల్ఫిన్ల జీవితకాలం 60 ఏళ్ల వరకూ ఉంటుంది. కొన్ని ఆడ డాల్ఫిన్లు ప్రత్యేక పరిస్థితుల్లో 90 ఏళ్లు కూడా జీవించగలవు.  ఓర్కాస్ రకం డాల్ఫిన్ ఎక్కువ కాలం జీవిస్తుంది.

డాల్ఫిన్లకు నీరు చాలా అవసరం. నీరున్నంతవరకే అవి బతుకుతాయి. నీళ్లలోంచి బయటికొచ్చాక భూమ్మీద కేవలం కొన్ని గంటలే జీవించగలదు.

డాల్ఫిన్లు పరిమాణంలో భారీగానే ఉన్నా మనిషికి ఎలాంటి ఆపద కలిగించవు సరికదా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. డాల్ఫిన్ ఎంతకాలం జీవిస్తుందనేది ఆరోగ్యం, పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది.