ప్రస్తుతమున్న జీవనశైలి కారణంగా చిన్నవారిలో కూడా వృధాప్య ఛాయలు ఎక్కువ కన్పడుతున్నాయి.. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే దీర్ఘకాలం యౌవనంగా ఉండవచ్చు.
చర్మం హెల్తీగా .. మెరుస్తూ ఉండాలి అంటే చర్మానికి కావలసిన అవసరమైన పోషకాలు తప్పకుండా ఇవ్వాలి. తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ తప్పకుండా తినాలి
ముఖ్యంగా చర్మాన్ని హానికారకమైన యూవీ కిరణాలు తగలకుండా రక్షించుకోవాలి.. దీని కోసం క్రమమం తప్పకుండ "సన్ స్క్రీన్" తప్పక ఉపయోగించాలి.
సన్ స్క్రీన్ తో పాటు ప్రతి రోజు మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మాన్ని యౌవనంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. రోజూ క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ రాయడం అలవాటు చేయాలి.
క్రమం తప్పకుండ ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది.. అంతే కాకుండా చర్మంలో ప్రతి భాగానికి ఆక్సిజన్ సరఫరా అంది చర్మం హెల్తీ, గ్లోయింగ్ మారుతుంది.
చర్మం ఎప్పుడు మెరుస్తూ ఉండాలి అంటే బాడీ హైడ్రేట్ ఉండాలి.. దీని కొరకు రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తప్పకుండా తాగాలి. దీనితో చర్మం కాంతివంతంగా యవ్వనంగా కనిపిస్తుంది.
ప్రస్తుత ఉద్యోగాల కారణంగా లేక అనేక రకలా కారణాలతో మనుషులు ఒత్తిడి మరింత పెరుగుతుంది. మెడిటేషన్, యోగా ద్వారా ఒత్తిడి అనేది తగ్గి వృద్ధాప్యాన్నే కాదు..వ్యాధుల్ని కూడా తగ్గిస్తుంది.
అతి ముఖ్యంగా మద్యానికి ధూమపానానికి దూరంగా ఉండాలి.. స్మోకింగ్, లిక్కర్ కారణంగా కొలాజెన్ దెబ్బతిని చర్మంపై ముడతలు పడతాయి.