బ్లూ డ్రెస్ లో శోభా శెట్టి.. క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుందిగా
Phani CH
07 December 2024
శోభా శెట్టి గురించి కొత్తగా బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ ఉన్న స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది.
కార్తీకదీపం సీరియల్‌లో మోనిత యొక్క పాత్ర ఎంత పాపులరో మన అందరికి విదితమే. ఈ పాత్రలో నటించి అందరి మనసుల్లో నాటుకుపోయింది.
కార్తీకదీపం సీరియల్స్ లో నటించిన మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈ సీరియల్ తెలుగు లో కూడ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.
కార్తీక దీపంలో నటించిన ఈ మోనిత (శోభా శెట్టి) పాత్రను బుల్లితెర ఆడియన్స్ ఎన్నటికీ మర్చిపోలేరు. అసలు బుల్లితెర ప్రేక్షకులు ఎన్నిసార్లు శోభాను తిట్టుకున్నారో లెక్కేలేదు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి.. తన పెరఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుని మరింత క్రేజ్ సంపాదించుకుంది.
బిగ్ బాస్ ఫైనల్స్ కు వారం ముందు వరకు వెళ్లి ఎలిమినేట్ అయ్యింది. షో నుండి వచ్చిందో లేదో శోభా శెట్టిని రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది
కన్నడలోని కొన్ని సీరియల్స్‌తో పాటు అనేక సినిమాల్లో కూడా నటిస్తుంది మోనిత. తాజాగా ఈ భామ షేర్ చేసిన కొన్ని ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.