మాళవిక మోహనన్ అందాల జాతర.. మతిపోతుందంటున్న కుర్రకారు

Phani CH

07 December 2024

మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాట్ ఫోటోస్ తో చూపు తిప్పుకోనీడకుండా చేస్తుంది.

ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మాళవిక మోహనన్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2013లో 'పట్టమ్ పోలే' మూవీతో కథానాయికగా పరిచయమైంది మాళవిక మోహనన్. ఆ తర్వాత నటించిన మలయాళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తమిళంలో పేట, మాస్టర్ వంటి చిత్రాల నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

తమిళం, మలయాళంతో పాటు బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి ఈ మలయాళీ భామకు. బాలీవుడ్ లో వస్తున్న ‘యుద్ర’ అనే చిత్రంలో  ఒక కీలక పాత్రలో నటిస్తోంది మాళవిక మోహనన్.

తెలుగులో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్‌' మూవీతో కథానాయిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఈమెకు లక్ కలిసొస్తుందా లేదా అనేది చూడాలి.

రోజు రోజుకు ఈ బ్యూటీ గ్లామర్ డోస్ కూడా రెట్టింపు చేసి తన అందచందాలతో మైమరిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.