జుట్టు రంగు మెరుగు పడడానికి టీ ఆకులు: హెన్నాను జుట్టుకు అప్లై చేయాలనుకుంటే.. టీ ఆకులను నీటిలో వేసి మరిగించి, చల్లార్చి, ఫిల్టర్ చేసిన తర్వాత.. ఆ నీటిలో గోరింటాకు వేసి కలపండి. ఈ మిశ్రమం జుట్టు రంగుని మెరుగుపరుస్తుంది జుట్టు చిట్లి పోకుండా చేస్తుంది. అంతేకాదు ఎండిన మందార పువ్వులను జోడించడం వల్ల జుట్టు రంగు మెరుగుపడుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.