Viral Video: ఇది చూడటం మిస్ కావొద్దు..గుడికి కాపాలా కాస్తున్న సింహం… నెట్టింట వైరల్ అవుతున్న అద్భుత దృశ్యం
ఆలయాన్ని కాపలా కాస్తున్న సింహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను IFS అధికారి పర్వీన్ కాస్వాన్ షేర్ చేశారు. ఈ దృశ్యాన్ని గుజరాత్‌లోని ఏదో అలయం వద్ద చిత్రీకరించినట్లు తెలుస్తోంది. Xలో ఒక పోస్ట్‌లో షేర్ చేసిన...

ఆలయాన్ని కాపలా కాస్తున్న సింహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను IFS అధికారి పర్వీన్ కాస్వాన్ షేర్ చేశారు. ఈ దృశ్యాన్ని గుజరాత్‌లోని ఏదో అలయం వద్ద చిత్రీకరించినట్లు తెలుస్తోంది. Xలో ఒక పోస్ట్‌లో “ఎంత దివ్య దృశ్యం. ఆ సింహరాశి ఆలయాన్ని కాపలా కాస్తున్నట్లు కనిపిస్తోంది” అంటూ కాస్వాన్ క్యాప్షన్ ఇచ్చారు.
దేశం ‘నవరాత్రి పండుగ’ జరుపుకుంటున్న వేళ 27 సెకన్ల ఈ వీడియో క్లిప్ నెటిజన్లను తీవ్రంగా ఆకర్షించింది. అయితే ఇది నిజమైనదా లేక ఏఐ టెక్నాలజీతో రూపొందించారా అనే అనుమానం నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. IFS ఆఫీసర్ పోస్టు చేసినందున నమ్మాల్సి వస్తుందని కామెంట్స్ పెడుతున్నారు.
అయితే గిర్ అడవిల్లో దేవాలయ ఉన్నాయి. దేవిపుత్రులుగా పరిగణించబడే సింహాలకు ఇది నిలయం అంటూ మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. గిర్ అడవిలోని సింహాలు మనుషులపై దాడి చేయడం ఎప్పుడు వినలేదని మరో నెటిజన్ పోస్టు పెట్టారు. వేటాడే సింహాలు అక్కడ ఎందుకు ప్రశాంతంగా ఉంటాయనేది అర్థం కాని విషయం అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చూడండి:
What a divine sight. Look like that lioness is guarding the temple !! pic.twitter.com/bBlxlmKD4m
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 28, 2025
