AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: రైలులో ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు..? ఈ చిన్న తప్పు చేస్తే..

ట్రైన్‌లో బంగారం ఎంత తీసుకెళ్లొచ్చు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.. దీనికి ఏమైన లిమిట్ ఉందా..? అయితే రైల్వే దృష్టిలో బంగారం కూడా సాధారణ లగేజీ మాత్రమే. మీ టికెట్ క్లాస్‌ను బట్టి ఉన్న లగేజీ లిమిట్ లోపలే బంగారాన్ని తీసుకెళ్లవచ్చు. అయితే ఎక్కువ బంగారం తీసుకెళ్తే దానికి సంబంధించిన బిల్లులు మాత్రం కచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి.

Gold: రైలులో ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు..? ఈ చిన్న తప్పు చేస్తే..
How Much Gold Allowed On Train
Krishna S
|

Updated on: Oct 13, 2025 | 5:15 PM

Share

బంగార అనేది భారతీయులకు ప్రత్యేక సెంటిమెంట్. ధరలు పెరిగినా, తగ్గినా బంగారాన్ని కొంటూనే ఉంటారు. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే చాలామంది పెళ్ళిళ్లకు లేదా శుభకార్యాలకు రైలులో బంగారం తీసుకెళ్తుంటారు. అయితే ట్రైన్‌లో ఎంత బంగారం తీసుకెళ్లవచ్చు. బంగారం తీసుకెళ్లడానికి ఏమైనా ప్రత్యేక రూల్స్ ఉన్నాయా అనే చాలా మందికి ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ రూల్స్ ఎలా ఉన్నాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బంగారంపై రైల్వే నిబంధనలు

రైల్వేల దృష్టిలో బంగారం అనేది ఒక సాధారణ లగేజీ మాత్రమే. బంగాన్ని స్పెషల్‌గా చూడదు. దీనికి ఎలాంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు. మీరు మీ టికెట్‌కి ఎంత లగేజీ తీసుకెళ్లడానికి పర్మిషన్ ఉందో, ఆ పరిమితిలోనే బంగారాన్ని కూడా తీసుకెళ్లవచ్చు.

రైలు టికెట్‌ను బట్టి లగేజీ లిమిట్

  • ఫస్ట్ ఏసీ (1A) – 70 కిలోల వరకు
  • ఏసీ 2-టైర్ (2A) – 50 కిలోల వరకు
  • ఏసీ 3-టైర్ (3A), స్లీపర్ క్లాస్ (SL) – 40 కిలోల వరకు
  • జనరల్ క్లాస్ (GS) – 35 కిలోల వరకు

మీరు ఈ లగేజీ పరిమితిని మించితే అదనపు ఛార్జీలు లేదా జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.

బిల్లులు మాత్రం జాగ్రత్త..

మీరు చాలా ఎక్కువ మొత్తంలో బంగారం తీసుకెళ్తుంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని విషయాలను గుర్తుంచుకోమంటుంది. ధరించిన బంగారంపై లిమిట్ లేదు. అంటే మీరు మెడలో వేసుకున్నదానిపై ప్రత్యేక నిబంధన లేదు. అయితే పెద్ద మొత్తంలో తీసుకెళ్తే, ఆ బంగారం ఎలా కొన్నారు అనే దానికి సంబంధించిన బిల్లులు కచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. ఇది అవసరమైతే అధికారులకు చూపించడానికి హెల్ప్ అవుతుంది.

ఈ టిప్స్ పాటించండి

రైలులో దొంగతనం జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి

హ్యాండ్ బ్యాగ్‌లో మాత్రమే: బంగారాన్ని ఎప్పుడూ మీ చేతిలో ఉండే చిన్న బ్యాగ్‌లో పెట్టుకోండి. పెద్ద సూట్‌కేసుల్లో వద్దు.

పక్కనే ఉంచుకోండి: ప్రయాణం అంతా ఆ బ్యాగ్ మీ కళ్లముందే, మీ దగ్గరలోనే ఉండేలా చూసుకోండి.

విభజించి తీసుకెళ్లండి: ఒకే బ్యాగ్‌లో అంతా పెట్టకుండా ఎక్కువ బంగారం ఉంటే చిన్న చిన్న ప్యాకెట్లుగా విడదీసి, వేరే చోట్ల కూడా పెట్టుకోవడం మరింత సురక్షితం.

రైలులో బంగారం తీసుకెళ్లడం తప్పు కాదు. మీ లగేజీ లిమిట్ చూసుకుని, బిల్లులు దగ్గర పెట్టుకుని, భద్రత పాటించండి. మీ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!