Viral News: మన దేశంలో నీటిలో మునిగిపోయే 7 నగరాలు.. ఏపీ సహా ఎక్కడ ఉన్నాయంటే..
మానవులు చేసిన తప్పిదాల వలన వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. కాలాలు మారిపోతున్నాయి. వేసవి లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో ఎండలు మెండుగా కాస్తున్నాయి. వాతావరణంలో మార్పుల వలన సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచం మాత్రమే కాదు.. మన దేశం కూడా ప్రమాదాన్ని ఎదుర్కొనుందని NASA , IPCC హెచ్చరిస్తుంది.

NASA , IPCC నివేదిక ప్రకారం, 2100 సంవత్సరం నాటికి భారత దేశంలో అనేక నగరాలు నీటిలో మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అయితే ఈ ముప్పు వివిధ ఉద్గాలు నిర్దిష్ట కాలపరిమితిపై ఆధారపడి ఉంటుందని, కొన్ని నగరాల్లోని కొన్ని భాగాలు నిరుపయోగంగా మారవచ్చని, మరికొన్ని పూర్తి మునిగిపోయే ప్రమాదం ఉందని నాసా ఇప్పటికే ప్రకటించింది. మన దేశంలో ముంబై సహా ప్రధాన నగరాలు అదృశ్యం అయ్యే అవకాశం ఉందని.. ఈ విపత్తుని నివారించే చర్యలను సత్వరమే చేపట్టాలని సూచించింది. నాసా చెప్పిన మన దేశంలో కనిపించకుండా అదృశ్యం అయ్యే నగరాలు ఏమిటో తెలుసుకుందాం..
- చెన్నై : తమిళనాడులోని ముఖ్యమైన నగరం చెన్నై. ఇది ఈ శతాబ్దం చివరి నాటికి నీటిలో మునిగిపోయే అవకాశం ఉందని నాసా అంచనా వేసింది. చెన్నై 1.87 అడుగుల మేర సముద్రంలో కలిసిపోవచ్చు.
- ముంబై : అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ నగరం ముంబై దేశ ఆర్ధిక రాజధాగా ఖ్యాతిగాంచింది. ఇది అత్యంత దుర్బలమైన తీరప్రాంత నగరాల్లో ఒకటిగా గుర్తించబడింది. 2100 సంవత్సరం నాటికి ఈ నగరం సగానికి పైగా నీటిలో మునిగిపోతుందని నాసా అంచనా వేసింది.
- కొచ్చిన్ (కొచ్చి) : కేరళలో అందమైన నగరం కూడా సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల గణనీయంగా ప్రభావితమవుతుందని అంచనా. 2100 సంవత్సరం నాటికి 2.32 అడుగుల మేర నీటిలో మునిగిపోయే అవకాశం ఉంది. ఈ నగరంలోని అందాలు మన దేశీయులనే కాదు విదేశీయులను కూడా ఆకర్షిస్తుంది. ఈ అందమైన నగరం పెరుగుతున్న సముద్ర మట్టం, హిమాలయ గ్లేసియర్లు కరిగిపోవడం వలన కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది.
- విశాఖపట్నం: ఏపీలో ప్రముఖ నగరం విశాఖ పట్నం. ఇది కూడా త్వరలో కనుమరుగయ్యే నగరాల జాబితాలో ఉంది. 2100 నాటికి విశాఖపట్నం 1.77 అడుగుల మేర నీటిలో మునిగిపోతుందని అంచనా. ఈ నగరం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్త చర్యలు ఇప్పటి నుంచి తీసుకోకపోతే .. భవిష్యత్ తరాలు ఈ నగరాన్ని చూసే అవకాశం ఉండదు.
- భావ్‌నగర్: గుజరాత్‌లో ఉన్న భావ్‌నగర్ నగరం కూడా 2.70 అడుగుల ఎత్తు వరకు నీటిలో మునిగిపోతుందని అంచనా. 1724లో ఏర్పడిన ఈ భావ్‌నగర్ గుజరాత్ రాష్ట్రానికి ఒకప్పుడు రాజధాని. ఈ నగరం చారిత్రక యుగానికి ప్రత్యెక అనుబంధం ఉంది. ఈ నగరం నీటిలో అదృశ్యం అవుతుందనే ఆలోచన చరిత్ర కారులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.
- మంగళూరు: సముద్ర మట్టాలు పెరగడం వల్ల అధిక ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న మరో నగరం మంగళూరు. కర్ణాటకలోని ఈ అందమైన తీరప్రాంత నగరం. ఈ నగరం కూడా అంతరించిపోయే నగరాల జాబితాలో ఉంది. 1.87 అడుగుల లోతులో నీటిలో మునిగిపోతుందని అంచనా వేయడంతో ఈ నగరం భవిష్యత్తులో కనుమరుగవ్వవచ్చు.
- తూత్తుకుడి: తమిళనాడులో ప్రమాదంలో ఉన్న మరొక నగరం తూత్తుకుడి, ఇది ఈ శతాబ్దం చివరి నాటికి 1.9 అడుగుల మేర నీటిలో మునిగిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు ఈ చైతన్యవంతమైన ఓడరేవు నగరానికి గణనీయమైన ముప్పును కలిగిస్తున్నాయి, దీని ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి స్థిరమైన పరిష్కారాల కోసం అత్యవసర అవసరాన్ని నొక్కి చెబుతుంది.
- మోర్ముగావ్ : గోవాలో జువారీ నది ముఖద్వారం వద్ద ఉన్న ఒక ప్రధాన ఓడరేవు నగరం. ఈ గోవా ఓడరేవు నగరం కూడా ప్రమాదంలో ఉన్న నగరాల జాబితాలో ఉంది.
అయితే ఈ నగరాలు “అదృశ్యం” అంటే భూమి పాక్షికంగా కోల్పోవడం, వరదలు లేదా పూర్తిగా ముంపునకు గురికావడం వల్ల నిరుపయోగంగా మారడం, వేర్వేరు అంచనాలు వేర్వేరు ప్రభావాలు కలిగి ఉండవచ్చు. అయితే ఈ అధ్యయనంపై మరింతగా పరిశోధనలు చేస్తున్నారు. నిరంతరం అభివృద్ధి చెందుతోన్న వాతావరణ శాస్త్రం కొత్త అధ్యయనాలు విభిన్న ఉద్గార పరిస్థితుల ఆధారంగా నవీకరించబడిన అంచనాలను అందిస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








