AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: ఏంట్రా ఇలా తయారయ్యారు.. సమోసా తేలేదని భర్తని కొట్టిన భార్య..

ఒకప్పుడు అడిగిన వెంటనే టీ తీసుకుని రాలేదని భార్యని కొట్టిన భర్త వంటి వార్తలు వినిపించేవి. ఇప్పుడు టైం మారింది.. భార్యకు కోపం వస్తే.. భర్తని కొట్టేస్తుంది. వాస్తవంగా గొడవలు లేని కుటుంబం ఉండదు. చిన్న చిన్న గొడవలు సర్వాధారణం. అయితే భర్తని సమోసా అడిగితే తీసుకుని రాలేదని ఒక భార్యకు కోపం వచ్చింది. దీంతో ఆ భర్తపై దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Uttar Pradesh: ఏంట్రా ఇలా తయారయ్యారు.. సమోసా తేలేదని భర్తని కొట్టిన భార్య..
Viral VideoImage Credit source: Twitter
Surya Kala
|

Updated on: Sep 06, 2025 | 5:52 PM

Share

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, అభిప్రాయభేదాలు సర్వసాధారణం. అభిప్రాయ భేదం వచ్చినప్పుడు.. ఒకరితో ఒకరు చర్చించుకుని పరిష్కారం వేడుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడు కాలంలో వచ్చిన మార్పుల్లో భార్యాభర్తల ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చాయి. భార్యాభర్తలు గొడవ పడటానికి చిన్న చిన్న కారణాలు చాలు. స్నాక్స్ తినలేదనే కోపంతో భర్తలతో గొడవ పడే భార్యలు ఉన్నారు. టీ తేలేదని.. కూర సరిగ్గా చేయాలనీ భార్యని కొట్టే భర్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సమోసా తీసుకురావడం మర్చిపోయాడని ఒక భార్య తన భర్తపై దాడి చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆనంద్‌పూర్‌లో జరిగిందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కొన్ని సంవత్సరాల క్రితం శివం అనే వ్యక్తి సంగీతను వివాహం చేసుకున్నాడు. భార్య ఏది కోరినా వెంటనే తీర్చే శివని సంగీత సమోసాలు తీసుకుని రమ్మన మని కోరింది. ఆయితే శివ ఇంటి వచ్చే సమయంలో సమోసాలు తీసుకురావడం మరచిపోయాడు. భర్త ఖాళీ చేతులతో ఇంటికి రావడం చూసిన భార్యకు కోపం వచ్చింది. గొడవకు దిగింది. ఆమె అన్నం తినడం మానేసి తన కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేసింది. ఆమె కుటుంబ సభ్యులు శివం ఇంటికి వచ్చి ఇద్దరికీ సయోధ్య కుదర్చాలని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.

సంగీత కుటుంబ సభ్యులు శివంపై దాడి చేశారు.

పంచాయతీలో ఈ విషయం తీవ్రమైంది. సంగీత కుటుంబ సభ్యులు శివం , అతని తండ్రి విజయ్ కుమార్ పై దాడి చేశారు. ఈ సమయంలో పొరుగువారు జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. ఈ సంఘటనపై శివం తండ్రి విజయ్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా దాడి చేసిన సంగీత, ఆమె తల్లిదండ్రులు ఉష, రామ్‌లాడితే , మామ రామోతర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులపై బిఎన్‌ఎస్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 1న పూర్ణపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పిలిభిత్ పోలీసులు తెలిపారు.

ఈ వైరల్ వీడియోలో రెండు కుటుంబాల మధ్య గొడవ కనిపిస్తుంది. పొరుగువారు జోక్యం చేసుకుని గొడవను చెదరగొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. భార్య మణులు అడిగిందా మాణిక్యాలు అడిగిందా.. సమోసానే కదా అన్న ఎందుకు తీసుకుని రాలేదు అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!