Biryani Health Risk: మీ ఫేవరెట్ బిర్యానీతో ముంచుకొచ్చే ముప్పు తెలుసా..
చాలామందికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. మటన్, చికెన్ అనే తేడా లేదు బిర్యానీ అయితే చాలు లొట్టలేసుకుంటూ ఇష్టమా తినేస్తారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా.. ఇష్టమని.. బిర్యానీ ఎక్కువగా తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును బిర్యానీ ప్రియుల ఆరోగ్యాన్ని ఆ బిర్యానీనే ప్రమాదంలో పడేస్తుందట. ఈ రోజు ఎక్కువుగా బిర్యానీ తినడం వలన కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాం..

దక్షిణాసియాలోనే ప్రసిద్ది చెందిన వంటకం బిర్యానీ. చికెన్, మటన్, రొయ్యలు, పీతలు, గుడ్డు, కూరగాయలు ఇలా రకరకాల బిర్యానీలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. చాలా మందికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఏ చిన్న సందర్భం వచ్చినా వెంటనే బిర్యానీ తినడానికి ఇష్టపడతారు. మటన్, చికెన్ అనే తేడా లేదు.. లోట్టలేసుకుంటూ తినేస్తారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా గల్లీ గల్లీ బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి. ఇక ఇంట్లో ఆదివారం వచ్చినా ఏ చిన్న సందర్భం వచ్చినా గుమగుమలాడే బిర్యానీ ఉండాల్సిందే. అయితే బిర్యానీ ప్రియులు జాగ్రత్త సుమా.. అతిగా తినడం వలన దుష్ప్రభావాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీ తయారీ చేయడంలో ఉపయోగించే కొన్ని పదార్ధాలలో అధిక కేలరీలు, కొవ్వు పదార్ధం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు మీకు తెలియకుండానే ఎన్నో ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెబుతున్నారని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యానికి ముప్పు: బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగించే నూనె, నెయ్యి మంచి నన్యమైనవి కాకపోయినా.. డాల్డాని ఎక్కువగా ఉపయోగించినా ఆరోగ్యానికి ప్రమాదకరం. బిర్యానీలో ట్రాన్స్ ఫ్యాట్స్, కొవ్వులు ఎక్కువగా ఉన్నాయి ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచుతాయి. ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి.. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌ల వంటి పరిస్థితులకు కారణం అవుతాయి.
బిర్యానీలో రుచి కోసం వేసే ఉప్పు సాధారణ ఆహరం తయారీ కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. కనుక బీపీ పెరిగి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
కిడ్నీ సమస్యలు: బిర్యానీ తయారీకి ఉపయోగించే కొన్ని రకాల కొన్ని పదార్థాలు కిడ్నీల పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తాయి. కిడ్నీ సమస్యలకు కారణం అవుతాయి. కనుక బిర్యానీ తయారీకి ఉపయోగించే వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
బరువు: బిర్యానీలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. మాంసం, బియ్యం, జీడిపప్పు, నెయ్యి, నూనె వంటి పదార్ధాలను ఉపయోగించి బిర్యానీని తయారు చేస్తారు. దీనిని ఎక్కువగా తింటే శరీరంలో క్యాలరీలు బాగా పెరిగిపోతాయి. దీంతో బరువు పెరుగుతారు. ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడతారు.
ఇష్టం అంటూ బిర్యానీని ముఖ్యంగా మటన్ తో చేసిన బిర్యనీని ఎక్కువగా తినడం వల్ల కాలేయం కూడా దెబ్బతింటుంది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వస్తుంది. ఒకొక్కసారి టైప్ 2 డయాబెటిస్ సమస్యకు దారి తీస్తుంది.
జీర్ణ సమస్యలు: బిర్యానీని ఎక్కువగా తినడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి,, అసిడిటీ, గుండెలో మంట, మలబద్ధకం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
బిర్యనీ తయారీకి ఉపయోగించే మసాలాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కనుక బిర్యనీని తినే ప్రదేశంలో ఉపయోగించే పదార్ధాలపై దృష్టి పెట్టండి. అంతేకాదు తక్కువగా తినండి. ఆరోగ్యంగా ఉండండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








