Nostradamus: మళ్ళీ తెరపై నోస్ట్రాడమస్ అంచనాలు.. దక్షినాది నుంచి శక్తివంతమైన నాయకుడు.. విశ్వగురుగా భారత దేశం..
15వ శతాబ్దపు ప్రఖ్యాత ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త మైఖేల్ డి నోస్ట్రాడమస్ వేసిన అనేక అంచనాలు నిజమయ్యాయి. ఆయన రాసిన లెస్ ప్రోఫెటీస్ పుస్తకంలో ప్రపంచం గురించి అనేక భవిష్యత్ అంచనాలు, ప్రవచనాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఖచ్చితమైనవిగా నిరూపించబడ్డాయి. తాజాగా నోస్ట్రాడమస్ భారత దేశం గురించి రష్యా గురించి చెప్పిన ఒక అంచనా ఇప్పుడు వైరల్ అవుతోంది. భారతదేశం హిందూ రాష్ట్రంగా మారుతుందనే అంచనాతో పాటు.. ప్రపంచంలో ప్రధాన కమ్యూనిజ దేశం కమ్యూనిజాన్ని విడిచి హిందూ మతాన్ని స్వీకరిస్తుందని.. ప్రపంచవ్యాప్తంగా దానిని ప్రచారం చేస్తుందని జోస్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.

8వ శతాబ్దపు ప్రఖ్యాత ఫ్రెంచ్ పండితుడు నోస్ట్రాడమస్ చేసిన భవిష్యత్ అంచనాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అవి తరచుగా నిజమయ్యాయి. గత 400 సంవత్సరాలలో ఆయన చెప్పిన 800 కు పైగా భవిష్యవాణులు నిజం అయ్యాయి. వాటిలో 1942 లో బ్రిటిష్ సామ్రాజ్యం కూలిపోతుందనే అంచనాతో పాటు క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులకు భారీ ఎదురుదెబ్బ.. యూదుల సామూహిక హత్యకు నాజీల వినాశనాన్ని కూడా ఆయన ఊహించారు. ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. మరోవైపు ఉద్రిక్తత పరిస్థితులున్నాయి. ఈ వాతావరణ మార్పుల మధ్య రాజకీయ అస్తితరపై ఆందోళన పెరుగుతోంది. మరోవైపు భారత్ దృఢమైన వైఖరితో.. తన ప్రాభల్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా పెచుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారత్ వైపే ఉంది. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ భవిష్యత్తు గురించి చెప్పిన నాస్ట్రడామస్ భవిష్యవాణి మళ్ళీ తెరపైకి వచ్చింది. కొత్త ఊహాగానాలకు దారితీస్తోంది.
నాస్ట్రడామస్ ఈ భవిష్యవాణిలోని కొన్ని భాగాలలో ఆసియా, మధ్యప్రాచ్యంలోని విస్తారమైన ప్రాంతాలలో హిందూ మతం అభివృద్ధి చెందుతుందని, భారతదేశం విశ్వగురువుగా మారుతుందని చెప్పారు. నాస్ట్రడామస్ భవిష్యవాణి ప్రకారం మూడు సముద్రాలు కలిసే ద్వీపకల్పం ..అంటే భారత ద్వీపకల్పంలోని దక్షిణ భారతదేశం నుంచి ఒక శక్తివంతమైన నాయకుడు వస్తాడు. అతను మొత్తం ఆసియాను ఏకం చేస్తాడు. అతను ప్రపంచం అంతటా శాంతి, శ్రేయస్సును స్థాపిస్తాడు. ఈ నాయకుడు ధర్మబద్ధుడై ఉంటాడు. అలాగే శత్రువులను నాశనం చేయడానికి కూడా వెనుకాడడని పేర్కొన్నాడు.
speakingtree.in ప్రకారం రష్యా కమ్యూనిజాన్ని వదిలివేసి హిందూ ధర్మాన్ని అనుసరిస్తుందని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. సనాతన ధర్మం మధ్యప్రాచ్యం గుండా దూసుకుపోతుందని.. భారతదేశ సంస్కృతి, యోగా, వేదాంతం వంటి సనాతన జ్ఞానం ప్రపంచమంతటా వ్యాపిస్తుందని చెప్పారు. నాస్ట్రడామస్ తన ఒక పద్యంలో (క్వాట్రైన్ 95, సెంచరీ III) ఇలా రాశారు:
‘ది క్రీడ్ ఆఫ్ ది మూర్ విల్ పెరిష్, ఫాలోడ్ బి అనదర్ మోర్ పాపులర్ స్టిల్, ది డ్‌నీపర్ విల్ బి ది ఫస్ట్ టు రెలిష్, ది విజ్డమ్ విచ్ ఇంపోసెస్ ఇట్స్ విల్.’
ఈ పంక్తుల వివరణలో ఒక పాత మతం అంతరించిపోతుందని..దాని స్థానంలో హిందూ సంస్కృతి పుంజుకుంటుందని చెప్పబడింది. 21వ శతాబ్దం భారతదేశానిదే అని ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదుగుతుందని.. దాని ఆధ్యాత్మిక తత్వశాస్త్రం, హిందూ మతంతో సహా – ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఒక భారతీయ నాయకుడు ప్రపంచ రాజకీయాలు, ఆధ్యాత్మికతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాడని అంచనా వేశాడు.
🔮 Nostradamus’ Prophecy on Hindu Rashtra! 🚩
🔸 Once India 🇮🇳 becomes a Hindu Rashtra, Russia 🇷🇺will embrace Hindu Dharma & spread it worldwide!
🔸 Nostradamus also foretold that a Hindu leader from South India will rise to lead the nation!
🔸 Shankaracharya Swami… pic.twitter.com/5qD5nlyJGj
— Sanatan Prabhat (@SanatanPrabhat) March 14, 2025
సనాతన ధర్మం యోగా ప్రపంచ విస్తరణ భారతీయ సంస్కృతి, యోగా, వేదాంతాలు ప్రపంచ గుర్తింపు, ప్రాముఖ్యతను పొందే సమయం వస్తుందని నోస్ట్రాడమస్ ఊహించాడు. నేడు యోగా, ధ్యానం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందాయి. ఇది అతని జోస్యంతో సరిపోలుతుందని కొందరు నమ్ముతారు.
భవిష్యవాణిలో ఇంకా చెప్పినదేమంటే.. 2025లో తీవ్రమైన వేసవి ఉంటుంది. ఐరోపాతో సహా ప్రపంచం అంతటా వాతావరణ మార్పుల బారిన పడుతుంది. భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ, నాస్ట్రడామస్ భారతదేశం సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అణు యుద్ధం ప్రారంభం కావచ్చని ఆయన హెచ్చరించారు. ఈ రాజకీయ, సామాజిక అస్థిరత సమయంలో నాస్ట్రడామస్ ఈ భవిష్యవాణి నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణ ప్రజల మనసులో “నిజంగా ఇది జరుగుతుందా” అనే ప్రశ్నను రేకెత్తిస్తోంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




