- Telugu News Photo Gallery Spiritual photos vastu tips for hibiscus plant: know Placement , Rituals to Attract Wealth and Happiness
Hibiscus Plant Vastu Tips: మందార మొక్క అయస్కాంతంలా డబ్బును ఆకర్షిస్తుంది.. ఈ దిశలో నాటితే పేదరికం తొలగిపోతుంది
అదృష్టాన్ని ప్రకాశవంతం చేసే పువ్వులు చాలా ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే ఈ పువ్వుల్లో మందారం పువ్వుకు విశేషమైన స్థానం ఉంది. మందారం పువ్వు ఆధ్యాత్మికంగానే కాదు ఆయుర్వేదం ప్రకారం కూడా అనేక రకాల ఉపయోగాలున్నాయి. ఎందుకంటే లక్ష్మీదేవి, గణపతి పూజలో మందారం పువ్వుని ఉపయోగిస్తారు. అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది.
Updated on: Sep 06, 2025 | 11:08 AM

మందార పువ్వు చాలా మంది ఇళ్ళలో తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా నేటికీ గ్రామాల్లోని ప్రతి ఇంట్లో రకరకాల మందార పువ్వుల మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. మందార పువ్వులు సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి ప్రీతికరమైనవని నమ్ముతారు . కనుక వాస్తు ప్రకారం ఈ మొక్కను ఒక నిర్దిష్ట దిశలో నాటితే అది ఇంట్లోని సమస్యలను పరిష్కరిస్తుందని పేర్కొంది.

ఇంట్లో పువ్వులు , మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంటి వాతావరణానికి మాత్రమే కాకుండా వాస్తు ప్రకారం.. ఇంటి ఆనందం, శ్రేయస్సుకు పువ్వులు, మొక్కలు చాలా ముఖ్యమైనవి. నమ్మకం ప్రకారం మొక్కలను దేవతలు , దేవుళ్ళకు కూడా చాలా ప్రియమైనవిగా భావిస్తారు. ఇంట్లో నాటిన కొన్ని మొక్కలు సానుకూల శక్తిని ప్రసారం చేస్తాయి. మరికొన్ని ప్రతికూల శక్తిని ప్రసారం చేస్తాయని చెబుతారు. అందువల్ల వాస్తు శాస్త్రం ప్రకారం పువ్వులు, మొక్కల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇంట్లో పెంచుకోవాలి.

వాస్తు శాస్త్రంలో ఇంటి శ్రేయస్సుకు మందార పువ్వు చిహ్నంగా పేర్కొంది. మందార పువ్వులు అనేక రంగుల్లో ఉంటాయి. అయితే ఎరుపు రంగు మందారం పువ్వుకి విశేష స్థానం ఉంది. నమ్మకం ప్రకారం ఈ పువ్వును లక్ష్మీదేవి, కాళి మాత, గణేశుడికి ఇష్టమైన పువ్వు. కనుక ఈ పువ్వుతో పూజకు విశేష స్థానం ఉంది. మందార పువ్వుని దైవంగా భావిస్తారు. అలాగే ఇంట్లో సానుకూలతను తీసుకురావడానికి వాస్తు శాస్త్రంలో మందార పువ్వు మొక్కను నాటడం సిఫార్సు చేయబడింది.

ఈ పువ్వు లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనది. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం మందార మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి. ఈ రెండు దిశలు ఈ మొక్కకు మంచివిగా భావిస్తారు. ఈ పువ్వును కిటికీ దగ్గర నాటితే తగినంత సూర్యకాంతి లభిస్తుంది. అలాగే మొక్క ఎండిపోకుండా ఎల్లప్పుడూ నీరు అందించాలి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో ఉన్నవారిపై ఎల్లప్పుడూ లక్ష్మీ దేవి ఆశీస్సులు ఉంటాయి.

మరోవైపు సనాతన ధర్మం విశ్వాసాల ఆధారంగా మంగళవారం బజరంగబలికి మందార పువ్వును సమర్పించడం మంచిదని భావిస్తారు. మంగళ దోషాన్ని తొలగిస్తుంది.

దీనితో పాటు సూర్య భగవానుడి పూజలో కూడా ఎర్ర మందారాన్ని ఉపయోగిస్తారు. ఇంట్లో సమస్యలను పరిష్కరించడానికి రాగి పాత్రలో నీటిలో మందార పువ్వు వేసి ఆ నీటితో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఫలవంతం.

ఇంట్లో మందార పువ్వులను ఉంచుకోవడంతో పాటు వాటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దేవతల పూజలో మందారం పువ్వుని తప్పనిసరిగా ఉపయోగించండి. అంతేకాదు మందార మొక్కను స్నేహితులు లేదా శత్రువులకు కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.

వాస్తు శాస్త్రంలో, అనేక రకాల పువ్వులను ఇంట్లో ఉంచుకోవడం మంచిదని పేర్కొంది. ఈ ఒక్క పువ్వుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మందారం పువ్వు ఇంట్లో ఆనందాన్ని తెస్తుంది.

Hibiscus




