AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. గతేడాది కంటే రూ4లక్షల 99వేలు అధికం..! ఎంత ధర పలికిందంటే..

గతేడాది కంటే రూ.4లక్షల 99వేలు అధికంగా పలికిన లడ్డూ ధర ఈ యేడు రికార్డును తిరగరాసింది. బాలాపూర్ బొడ్రాయి దగ్గర జరిగిన వేలం పాట నిర్వహణ మొదటి నుంచి ఎంతో ఉత్సహంగా సాగింది. లడ్డూ వేలం పాటలో 38 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న లడ్డూ వేలం పాట ఈ యేడు 4లక్షల 99వేలు అధికంగా పలికింది. బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర పలికింది.

రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. గతేడాది కంటే రూ4లక్షల 99వేలు అధికం..! ఎంత ధర పలికిందంటే..
Balapur Ganesh Laddu
Jyothi Gadda
|

Updated on: Sep 06, 2025 | 12:06 PM

Share

Balapur Laddu Auction 2025 : భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించే బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట పూర్తైంది. గతేడాది కంటే రూ.4లక్షల 99వేలు అధికంగా పలికిన లడ్డూ వేలం పాట ఈ యేడు రికార్డు సృష్టించింది..  ఏకంగా రూ.35 లక్షలు పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్‌ అనే వ్యక్తి రూ.35 లక్షలకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. బాలాపూర్ లంబోదరుడి చేతిలో నవరాత్రులు పూజలందుకున్న లడ్డు వేలం పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే గణేశుడి లడ్డూ వేలం పాట కోసం సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు భక్తులు.

ఈ సంవత్సరం కూడా బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం అత్యంత ఉత్సహంగా , ఉత్కంఠభరితంగా సాగింది. లడ్డూ వేలం పాటలో పాల్గొనేందుకు 38 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాటలో నువ్వా నేనా అన్నట్లుగా వేలం పాట జరుగుతుంది. ప్రతి ఏటా పెరుగుతున్న లడ్డూ వేలం రూ.35 లక్షలు పలికింది.  కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ ను ఈ సారి అదృష్టం వరించింది.  గత ఏడాది 30 లక్షల వెయ్యి రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు కొలన్‌ శంకర్‌రెడ్డి.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలం పాట ఇక్కడ ఒక సంప్రదాయంగా మారింది. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ లడ్డూ వేలంపాట ద్వారా వచ్చే నగదును గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంది ఉత్సవ సమితి. ఇప్పటి వరకు కోటి 64 లక్షల 87 వేల 970లు ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు.

ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా బాలాపూర్​ లడ్డూ వేలం పాట జరిగింది. పార్టీలకు అతీతంగా ఇక్కడ వినాయక ఉత్సవాలు , లడ్డూ వేలం పాట నిర్వహిస్తున్నారు. ఈ యేడు వేలం పాటకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలాపూర్‌లో పుట్టిన వాళ్లంతా అదృష్టవంతులేనని అన్నారు. బాలాపూర్‌ గణనాథుడు కొలువుదీరిన ఈ మహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వడం తన అదృష్టం అన్నారు సబితా.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్