AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… రేపటి నుండి తిరుపతి ఆలయం మూసివేత.! దర్శనం మళ్ళీ ఎప్పుడంటే..

ఆదివారం ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు మూసివేయబడతాయి. సోమవారం ఉదయం 8.30 గంటల నుండి అన్నప్రసాద పంపిణీ తిరిగి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో దర్శనానికి అనుమతి ఉండదని, భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని టీటీడీ సూచించింది.

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్... రేపటి నుండి తిరుపతి ఆలయం మూసివేత.! దర్శనం మళ్ళీ ఎప్పుడంటే..
Ttd Announcement
Jyothi Gadda
|

Updated on: Sep 06, 2025 | 8:37 AM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన సమాచారం. (రేపు) సెప్టెంబర్ 6 నుంచి 7 తేదీలలో శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వివరాలు వెల్లడించింది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేయబడుతుంది. ఆదివారం రాత్రి 9.50 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయబడతాయి.

సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతంతో ఆలయాన్ని తెరిచి శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పుణ్యాహవచనం నిర్వహిస్తారు. తోమల సేవ, అర్చన వంటి కార్యక్రమాలు ప్రైవేట్‌గా నిర్వహించబడతాయని ఆలయ అధికారులు వివరించారు. ఆ సమయంలో దర్శనానికి అనుమతి ఉండదని, భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని సూచించింది.

సోమవారం ఉదయం 6 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు మూసివేయబడతాయి. సోమవారం ఉదయం 8.30 గంటల నుండి అన్నప్రసాద పంపిణీ తిరిగి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!
'రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే'
'రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే'
పోటీలేదు.. తిరుగుండదు.! కేవలం రూ. 5 వేల పెట్టుబడితో
పోటీలేదు.. తిరుగుండదు.! కేవలం రూ. 5 వేల పెట్టుబడితో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్.
పిల్లల్లో తెలివితేటలు పెంచే  షుగర్ ఫ్రీ లడ్డూ.. ఒక్కటి తింటే చాలు
పిల్లల్లో తెలివితేటలు పెంచే  షుగర్ ఫ్రీ లడ్డూ.. ఒక్కటి తింటే చాలు