పిరియడ్స్ ఆలస్యం అవ్వాలని మాత్రలు వేసుకుంటున్నారా..? 18ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి..
చాలా మంది అమ్మాయిలు, మహిళలు ఏదో ఒక కారణం చేత కొన్నిసార్లు ఋతుచక్రాన్ని ఆలస్యం చేయడానికి మందులు తీసుకుంటారు. పీరియడ్స్ తేదీని మందులు ఆలస్యం చేస్తాయి. కానీ, ఇలా ఋతుచక్రాన్ని ఆలస్యం చేయడానికి మందులు తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్రమైన సమస్యలు వస్తాయని మీకు తెలుసా..?

పీరియడ్స్ ఆలస్యం చేయడానికి మందులు తీసుకోవడం వల్ల శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. హార్మోన్ల మాత్రలు రక్తం గడ్డకట్టడం, థ్రాంబోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలను కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా పీరియడ్స్ ఆపడానికి మందులు తీసుకున్న తర్వాత ఒక అమ్మాయి చనిపోయింది. హార్మోన్ల మందులు ఎందుకు ప్రమాదకరమో తెలుసుకోండి.
పీరియడ్స్ ఆలస్యం కావడానికి మందులు తిన్న యువతి మృతి:
ఒక పాడ్‌కాస్ట్‌లో వాస్కులర్ సర్జన్ డాక్టర్ వివేకానంద్ మాట్లాడుతూ… కొంతకాలం క్రితం 18 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని తన దగ్గరకు వచ్చితొడ దగ్గర నొప్పిగా ఉందని ఫిర్యాదు చేసింది.. రొటీన్ చెకప్ సమయంలో ఆ అమ్మాయి పీరియడ్స్ ఆపడానికి హార్మోన్ల మందులు తీసుకున్నానని చెప్పింది. ఇంట్లో పూజకు హాజరు కావడానికి ఆ అమ్మాయి ఇలా చేసింది. అదే ఆమెకు శాపంగా మారింది. ఆమెకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (సిరల్లో గడ్డకట్టడం) ఉందని డాక్టర్ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ, తల్లిదండ్రులు ఆమెకు చికిత్స అందించకపోవడంతో సదరు యువతి మరణించినట్టుగా డాక్టర్ వెల్లడించారు.
హార్మోన్ల మాత్రలు రక్తం చిక్కగా మారడానికి కారణమవుతాయి:
హార్మోన్ల మాత్రలు తీసుకోవడం శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. పీరియడ్స్ ఆపడానికి మందులు తీసుకోవడం వల్ల రక్తం చిక్కగా మారుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఇది గుండె నుండి మెదడు కణాల వరకు సంభవించవచ్చు. సకాలంలో చికిత్స పొందకపోతే ప్రాణాంతకం కావచ్చు అని వివరించారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
థ్రాంబోసిస్ అంటే ఏమిటి?:
థ్రాంబోసిస్ అనేది రక్త నాళాల లోపల రక్తం గడ్డకట్టడం సంభవించే ఒక వైద్య పరిస్థితి. దీని వలన రక్త ప్రవాహంలో సమస్యలు వస్తాయి. ఇలా గడ్డకట్టడం వల్ల శరీరంలోని ఇతర భాగాలలో స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేస్తే పెద్ద సమస్యను నివారించవచ్చు.
మీరు కూడా పీరియడ్స్ ఆలస్యం చేయడానికి మీకు ఎప్పుడైనా మందులు అవసరమైతే, మెడికల్ స్టోర్ నుండి మందులు కొనడానికి బదులుగా, మీరు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మెడిసిన్ తీసుకోవచ్చు. డాక్టర్ మొదట మీ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన తరువాత మీకు మందు ఇస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








