ఈ క్షేత్రంలో శివయ్య నిద్రపోడని నమ్మకం.. అందుకే రోజంతా అభిషేకం, పూజలు..
భారతదేశంలో ప్రసిద్ది చెందిన పవిత్రమైన శైవ క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలున్నాయి. శివ భక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవాలని కోరుకుంటారు. అయితే ఒక శైవ క్షేత్రంలో సంప్రదాయం ప్రత్యేకమైనది. ఆ శివాలయం తలపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. శివలింగానికి జలాభిషేకం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. స్వయంభు శివ లింగం పూజ ఇప్పటి వరకూ ఎప్పుడూ ఆగలేదని చెబుతారు. అందుకనే ఈ ఆలయం.. ఇతర దేవాలయాల నుంచి ప్రత్యేకంగా చేస్తుంది.

వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ క్షేత్రం అణువణువున ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రతి వీధి నుంచి ఏదో ఒక మంత్రం వెలువడుతూనే ఉంటుంది. ఇక్కడ ఉదయం హారతి, శివుని స్తుతితో ప్రారంభమవుతుంది. అయితే ఈ నగరంలో పగలు, రాత్రి, ఋతువులు లేదా సమయం అనే తేడా లేకుండా పాటించే సంప్రదాయం ఉందని మీకు తెలుసా? కాశీ విశ్వనాథ ఆలయంలో శివుని శివలింగాన్ని 24 గంటలు.. వారంలో ఏడు రోజులు, సంవత్సరంలో 365 రోజులు జలభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ సంప్రదాయం కేవలం విశ్వాసానికి మాత్రమే చిహ్నం కాదు.. భారతదేశం ఆధ్యాత్మికకు నెలవు.
శివుడు నివసించే నగరం కాశి కాశీ సాధారణ తీర్థయాత్ర క్షేత్రం కాదని హిందువుల నమ్మకం. శివుడు స్వయంగా కాశీ క్షేత్రాన్ని తనకు ఇష్టమైన నగరం అని చెప్పాడు. స్కంద పురాణం ప్రకారం “కాశ్యాంతు మరణం ముక్తి” అంటే కాశీలో మరణం కూడా మోక్షానికి ద్వారం అని అర్థం. ఈ నగరంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం చాలాసార్లు ధ్వంసం చేయబడింది. అనేక సార్లు దోచుకోబడింది.. అయినా సరే ఇక్కడ శివునిపై భక్తి, విశ్వాసం ఎప్పుడూ తరగలేదు. ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన శివలింగానికి 24 గంటలూ జలభిషేకం చేసే సంప్రదాయం ఉంది. భక్తులు పగలు, రాత్రి జలం, నీరు, పాలు, బిల్వ పత్రాలు, తేనె మొదలైనవి సమర్పిస్తారు. అన్ని సమయాల్లో భక్తులు మహాదేవుడిని దర్శించుకోవడానికి చేతులు జోడించి నిలబడతారు.
రాత్రి 3 గంటలకు కూడా జలభిషేకం ఈ ఆలయం భక్తుల కోసం పగలు మాత్రమే కాదు రాత్రంతా తెరిచి ఉంటుంది. రాత్రి 3 గంటలకు కూడా ప్రజలు వరుసలో నిలబడి.. గంగాజలం చేతుల్లో పట్టుకుని హర హర మహాదేవ అని జపిస్తూనే ఉంటారు. ఈ సంప్రదాయానికి విరామం ఉండదు. హారతి ఇవ్వడానికి విరామం ఉండదు. ప్రత్యేక దర్శనం కోసం ప్రత్యేక మార్గం ఉండదు. ఒక సాధారణ భక్తుడు కూడా ఇక్కడ కొలువైన మహాదేవుడికి నీటిని అందిస్తాడు.
ఈ సంప్రదాయం చరిత్రలో ఎప్పుడూ ఆగలేదు. ఔరంగజేబు కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేసినప్పుడు కూడా శివ భక్తులు ఏదో ఒక రూపంలో రహస్యంగా జలాభిషేకం నిర్వహించారనే దానికి చరిత్ర పుటలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ సంప్రదాయం ఆ కాలంలో ఉన్నట్లే నేటికీ సజీవంగా ఉంది. బ్రిటిష్ కాలంలో కాశీ ఘాట్లను పునర్నిర్మించినప్పుడు కూడా.. ఈ ఆలయ సాంప్రదాయం చెక్కుచెదరకుండా ఉంది. స్థానిక బ్రాహ్మణులు, సాధువులు, ఇక్కడ భక్తులు ఈ సంప్రదాయాన్ని అనుసశ్రిస్తూనే ఉంటారు.
లాక్డౌన్ సమయంలో కూడా శివుని సేవ ఆగలేదు 2020 కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా దేవాలయాలను మూసివేసినప్పటికీ.. కాశీ విశ్వనాథ ఆలయంలో రోజూ జలాభిషేకం నిర్వహించేవారు. భక్తులను లోపలికి అనుమతించలేదు. అయితే ఆలయ పూజారులు విధిగా శివయ్యకు సేవ చేశారు. సాధారణ భక్తులు దర్శనం చేసుకునే అవకాశం లేకపోయినా.. కాశీ విశ్వనాథ ఆలయంలో “పూజ, అభిషేకాలు సంప్రదాయం ప్రకారం అంతరాయం లేకుండా నిరంతరం కొనసాగాయని ఆలయ సిబ్బంది చెప్పింది.
ఈ ప్రదేశం శక్తిని విశ్వసించే శాస్త్రవేత్తలు కాశీ నగరంపై ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడ భూమి కింద ఒక అద్భుతమైన శక్తి చక్రం నిరంతరం తిరుగుతూ ఉందని.. ఇది మానసిక , ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుందని నమ్ముతారు. బహుశా ఇక్కడ జలాభిషేకం కేవలం ఒక ఆచారంగా కాదు ఆధ్యాత్మిక సాంప్రదాయంగా పాటించడం వెనుక రీజన్ ఇదే కావచ్చు.
కాశీ క్షేత్రంలోని శివుడు ఎప్పుడూ నిద్రపోడు. కనుక అభిషేకం ఆగదు. ఈ కాశీ విశ్వనాథ ఆలయం కేవలం ఒక భవనం మాత్రమే కాదు.. సనాతన సంప్రదాయానికి కేంద్రం. ఇక్కడ మహాదేవుడి చేసే జలాఅభిషేక సంప్రదాయం భక్తికి సమయం ఉండదని బోధిస్తుంది. విశ్వాసం ఉన్నచోట సేవ కూడా నిరంతరం ఉంటుంది. ఇక్కడి శివలింగం ఎప్పుడూ ఎండిపోదు. భక్తి ప్రవాహం ఎప్పుడూ ఆగదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)








