Bhagavad Gita: జీవితంపై మీ ఆశలు ఆవిరి అయితే.. గీతలోని వీటిని గుర్తు చేసుకోండి.. కొత్త ఆశను నింపుతాయి
భగవద్గీత పవిత్ర గ్రంథం. మహాభారతం యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన బోధనలు నేటికీ అనుసరణీయం. మనిషి జీవితానికి సంబంధించిన ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం వంటి విషయాల గురించి తెలియజేశాడు. మీ జీవితంలో ఆశలు మసకబారడం ప్రారంభించినప్పుడు.. భగవద్గీతలోని ముఖ్యమైన బోధనలను గుర్తు చేసుకోండి.

భగవద్గీత కృష్ణుడు మనిషి జీవన విధానాని తెలియజేశాడు. దేనికీ అత్యాశపడకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం, ఆత్మ శాశ్వతమైనది, నాశనం చేయలేనిది అని గ్రహించడం, కోరికలు, బంధాలకు అతీతంగా జీవించడం వంటివి భగవద్గీతలోని ముఖ్యమైన బోధనలు. అదే విధంగా ప్రతి వ్యక్తికి జీవితంలో కొన్నిసార్లు ఛిన్నాభిన్నమయ్యే సమయం వస్తుంది. అతను తన చుట్టూ చీకటిని చూస్తాడు. ఆ సమయంలో ఎవరూ అతనికి మద్దతుగా నిలబడరు. లేదా ఏ వస్తువు కూడా మనసుకు శాంతిని ఇవ్వదు. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తికీ తనకు జీవించడానికి వేరే మార్గం లేదని అనిపిస్తుంది. అయితే అలాంటి క్లిష్ట క్షణాల్లో.. శ్రీకృష్ణుడు చెప్పిన గీతలోని బోధనలు నిజమైన మార్గదర్శకత్వం, మద్దతును అందిస్తాయి. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ధైర్యం, ఆశను మేల్కొల్పే గీతలోని 10 ప్రేరణాత్మక ఆలోచనలను గురించి తెలుసుకుందాం.
ఆశను మేల్కొల్పే భగవద్గీతలోని ముఖ్యమైన బోధనలు
- దేవుడిని నమ్మండి. దేవుడి ప్రణాళికపై నమ్మకం ఉంచండి. ఆయన మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తే.. దాని నుంచి బయటపడే మార్గాన్ని కూడా దేవుడే మీకు చూపిస్తాడు.
- పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. కష్టాలు శాశ్వతం కాదు.. కనుక ఆశని ఎప్పుడూ వదులుకోకండి.
- ప్రతి సంఘటనలోనూ మంచితనం దాగి ఉంటుంది. ఏం జరిగినా.. దేవుడు మీ కోసం ఇంకా ఎదోం మంచి చేయనున్నాడు అని అనుకోమని సూచించండి.
- నిరుత్సాహపడకండి. ప్రస్తుతం పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా.. ఏదో మంచి జరగనుందని నమ్మండి.
- వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. గడిచిపోయినది మంచిదే, జరుగుతున్నది కూడా మంచిదే.. రాబోయే కాలాలు కూడా శుభప్రదంగా ఉంటాయి.
- ప్రజలు ఏమి అంటారో అని ఆలోచించకండి.. లోకులకు భయపడకండి. మీరు మీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు.. ఆ వ్యక్తులే మిమ్మల్ని అభినందిస్తారు.
- నవ్వడం మర్చిపోవద్దు. ఒత్తిడి సమస్యలను పెంచుతుంది. అయితే సమస్యలకు చిరునవ్వు పరిష్కారాన్ని ఇస్తుంది.
- జీవితం మీదే.. పోరాటం మీదే. చివరికి.. ఈ ప్రపంచంలో మీకోసం మీరు మాత్రమే పోరాడాలని గుర్తు పెట్టుకోండి.
- నమ్మకంతో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఒక లక్ష్యంపై దృష్టి పెడితే.. దానిని సాధించకుండా ఎవరూ మిమ్మల్ని ఆపలేరు.
- నిన్ను నువ్వు తెలుసుకో.. తన గుణాలను, లోపాలను అర్థం చేసుకున్న వ్యక్తి మాత్రమే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలడు. ప్రతి రంగంలోనూ విజయం సాధించగలడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




