- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips for aparajita plant: know best and worst direction for planting shanku pushpi plant
Vastu Tips: శంఖు పుష్పి మొక్కను ఈ దిశలో ఈ రోజున నాటండి.. డబ్బుని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది..
సనాతన హిందూ ధర్మంలో కొన్ని రకాల మొక్కలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి మొక్కలో ఒకటి అపరాజిత మొక్క. దీనినే శంకుపుష్పం మొక్క అని కూడా అంటారు. ఇది విష్ణువుకు ఇష్టమైన మొక్క కనుక దీనిని విష్ణుప్రియ పరాజిత మొక్క అని అంటారు. ఈ తీగ మొక్క ఇంట్లో ఎంత వేగంగా పెరుగుతుందో.. ఆ ఇంట్లో నివసించే సభ్యులు అంత వేగంగా అభివృద్ధి చెందుతారని, ఆర్థిక లాభాలు కలుగుతాయని నమ్మకం. శని దోషాన్ని తొలగించి, ఐశ్వర్యాన్ని తెస్తుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. అయితే ఇంట్లో ఈ మొక్కని పెంచుకోవడానికి వాస్తు నియమాలున్నాయి. అవి ఏమిటంటే..
Updated on: Sep 04, 2025 | 12:58 PM

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టుకునే వస్తువు సానుకూల లేదా ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందుకనే వాస్తు నియమాలను పాటించాలి. దీనితో పాటు వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కల గురించి అనేక నియమాలు కూడా చెప్పబడ్డాయి. ఇంట్లో ఏ చెట్లు, మొక్కలు నాటడం శుభప్రదం.. ఏవి నాటడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు,పేదరికం కలుగుతాయనే విషయాలు పెర్కొనది. ఈ రోజు అపరాజిత మొక్కకి సంబంధించిన వాస్తు నియమాలను గురించి తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అపరాజిత మొక్క ఉంటుందో.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. ఆ మొక్కను సరైన దిశలో నాటాలి. అంతేకాదు శ్రీ మహాలక్ష్మితో పాటు, అపరాజిత మొక్క విష్ణువు, శనీశ్వరుడు, శివుడికి కూడా చాలా ప్రియమైనది. ఈ మొక్క ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావడంలో కూడా సహాయపడుతుంది. అపరాజిత మొక్కను ఏ దిశలో? ఎప్పుడు నాటడం శుభప్రదం? ఏ దిశలో నాటడం అశుభమో తెలుసుకోండి..

ఇంట్లో అపరాజిత మొక్కకు ఉత్తమ దిశ: వాస్తు శాస్త్రం ప్రకారం అపరాజిత మొక్కను నాటేటప్పుడు దిశను గుర్తుంచుకోవాలి. దీనిని ఎల్లప్పుడూ గణేశుడు, లక్ష్మి దేవి, కుబేరుడు నివసించే దిశలో నాటాలి. ఇంటి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో అపరాజిత మొక్కను నాటడం శుభప్రదం. ఈ దిశలో అపరాజిత మొక్కను నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సుతో పాటు సంపద, శ్రేయస్సు పెరుగుతుంది.

ఇంట్లో అపరాజిత నాటడానికి ఉత్తమ రోజు: వాస్తు శాస్త్రం ప్రకారం గురువారం లేదా శుక్రవారం ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం శుభప్రదం. ఎందుకంటే గురువారం విష్ణువుకు, శుక్రవారం లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ మొక్కను నాటడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుంది.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం శుభప్రదం: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున అపరాజిత మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

అపరాజిత మొక్కను ఏ దిశలో నాటవద్దంటే: వాస్తు శాస్త్రం ప్రకారం అపరాజిత మొక్కను ఇంటికి దక్షిణం లేదా పశ్చిమ దిశలో ఎప్పుడూ నాటకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది.

శనివారం నాడు అపరాజిత మొక్కను నాటడం ద్వారా మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చని నమ్ముతారు. దీనితో పాటు శనిశ్వరుడిని పూజించేటప్పుడు అపరాజిత పువ్వును సమర్పించడం వల్ల శని దేవుడి చెడు దృష్టి మీపై పడకుండా నిరోధిస్తుంది. శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.




