AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు.. కిలో ఎంతో తెలుసా..?

ఉప్పు.. ఇది లేకపోతే ఏ వంటకాన్ని తినలేం. దీన్ని కొంచెం వేసిన వంటకానికి కావాల్సిన టేస్ట్ తీసుకొస్తుంది. సాధారణంగా కిచెన్‌లో మనం ఉపయోగించే ఉప్పు ధర తక్కువగానే ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఒకటి ఉంది. దాని పేరు కొరియన్ బాంబూ సాల్ట్‌. ఈ అరుదైన ఉప్పు ధర కిలోకు ఏకంగా సుమారు రూ.35,246 పలుకుతోంది. దానికి ఎందుకు అంత ధర అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Sep 06, 2025 | 4:17 PM

Share
కొరియన్ బాంబూ సాల్ట్‌ తయారీ చాలా శ్రమతో కూడుకున్నది. అందుకే దీని ధర రూ.35వేలు ఉంటుంది.  ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. నైపుణ్యం కలిగిన కార్మికులు దీనిని తయారు చేస్తారు. మొదట కొరియా పశ్చిమ తీరం నుంచి సేకరించిన సముద్రపు ఉప్పును మందపాటి వెదురు బొంగుల్లో నింపుతారు. ఆ తర్వాత వాటిని పసుపు లేదా ఎరుపు బంకమట్టితో మూసివేస్తారు.

1 / 5
ఈ బొంగులను ఐరన్ ఓవెన్లలో ఉంచి, పైన్‌వుడ్ ఫైర్ సహాయంతో కాల్చుతారు. ఈ కాల్చే ప్రక్రియ తొమ్మిది సార్లు జరుగుతుంది. మొదటి ఎనిమిది సార్లు ఉష్ణోగ్రత 1,000°C వరకు చేరుకుంటుంది. ప్రతిసారి కాల్చిన తర్వాత గట్టిపడిన ఉప్పును తీసి, చూర్ణం చేసి, మళ్లీ వెదురు బొంగుల్లో నింపుతారు. తొమ్మిదోసారి చివరిగా 1500°C లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్చుతారు. ఈ చివరి కాల్చడం వల్ల ఉప్పు కరిగి, వెదురు, పైన్‌వుడ్ నుండి పోషకాలను, తీపి రుచిని గ్రహించి, ప్రత్యేకమైన ఊదా రంగులో 'పర్పుల్ బాంబూ సాల్ట్‌‌గా మారుతుంది.

2 / 5
ఈ ఉప్పు ధర అధికంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. తొమ్మిదిసార్లు కాల్చడం, పొడి చేయడం, తిరిగి నింపడం వంటి క్లిష్టమైన ప్రక్రియకు రెండు నెలల సమయం పడుతుంది. ఈ పనికి ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్న కార్మికులు, ప్రత్యేక ఓవెన్లు, అలాగే అధిక నాణ్యత గల వెదురు, పైన్‌వుడ్, సముద్రపు ఉప్పు వంటి పదార్థాలు అవసరం. ఇవన్నీ తయారీ ఖర్చును భారీగా పెంచుతాయి.

3 / 5

వంటలలో దీనిని ఉపయోగించడం వల్ల వచ్చే తీపి 'గామ్రోజంగ్' రుచి కొరియన్ వంటకాలకు ప్రత్యేకతను తెస్తుంది. ఇది కేవలం వంటకు మాత్రమే పరిమితం కాదు. కొరియన్ సంస్కృతిలో దీనిని సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుందని, అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ అరుదైన ఉప్పు అధిక ధర పలుకుతోంది.

4 / 5
భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఉప్పు కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనలో ఉప్పుపై భారీ పన్ను విధించారు. ఇది సామాన్య ప్రజలకు ఖరీదైనదిగా మారింది. మహాత్మా గాంధీ 1930లో దండి మార్చ్ ద్వారా ఈ పన్నుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నేడు భారతదేశంలో ఉప్పు చౌకగా ఉంది..కానీ అమెరికా వంటి దేశాలలో దాని ధర చాలా ఎక్కువగా ఉంది.

5 / 5