Viral Video: ఏం చేసింది భయ్యా.. చీరకట్టులో డ్యాన్స్ ఇరగదీసిన అమ్మడు.. చూస్తే లూప్‌లో పెట్టుకోవాల్సిందే!
కాలేజ్ ఫేర్వెల్ పార్టీ అంటే మామూలుగా ఉంటుందా.. డ్యాన్సులు, స్కిట్స్‌తో బలే హంగా ఉంటుంది. ఆరోజు మనం చేసే ప్రతి చిలిపి పని ఆ కాలేజ్ ఉన్న క్షణాలను గుర్తు తెస్తుంది. తాజాగా ఇలానే కాలేజ్ ఫేర్వేల్ డేలో ఒక అమ్మాయి చేసిన డ్యాన్స్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. సాంప్రదాయ చీరకట్టులో ఆ యువతి వేసిన స్టెప్పులను చూడాలంటే రెండు కళ్లు చాలవనే చెప్పాలి.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాలేజ్ ఫేర్వెల్ పార్టీ అంటే మామూలుగా ఉంటుందా.. డ్యాన్సులు, స్కిట్స్‌తో బలే హంగామా ఉంటుంది. ఆరోజు మనం చేసే ప్రతి చిలిపి పని ఆ కాలేజ్‌లో ఉన్న మధుర క్షణాలను గుర్తుతెస్తుంది. తాజాగా ఇలానే కాలేజ్ ఫేర్వేల్ డేలో ఒక అమ్మాయి చేసిన డ్యాన్స్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. సాంప్రదాయ చీరకట్టులో ఆ యువతి వేసిన స్టెప్పులను చూడాలంటే రెండు కళ్లు చాలవనే చెప్పాలి.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అమ్మాయి చేసిన డ్యాన్స్.. నాటి బాలీవుడ్ “చాందిని” అకా సుష్మితా సేన్‌ను గుర్తు చేసింది.
ఈ వైరల్ వీడియోలో.. త్రిపురకు చెందిన అంకిత అనే అమ్మాయి కాలేజ్ పేర్వెల్ డేలో భాగంగా చీర కట్టుకుని 2004 బ్లాక్ బస్టర్ చిత్రం “మై హూ నా” లోని ఐకానిక్ పాట “తుమ్సే మిల్కే దిల్ కా జో హాల్” పాటకు డ్యాన్స్ చేసింది. అంకిత చీరలో నృత్యం చేసిన చక్కదనం, చురుకుదనం యావత్ ప్రపంచాన్ని కట్టిపడేసింది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్, మూమెంట్స్, పరిపూర్ణ కొరియోగ్రఫీ అక్కడి జనాలతో పాటు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.
అంకిత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @ankitaaaa_official లో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవ్వడమే కాదు, రికార్డులను బ్రేక్ చేసింది. ఈ వీడియో ఈ వార్త రాసే సమయానికి 130 మిలియన్లకు పైగా వీవ్స్‌ను సొంతం చేసుకుంది. అలాగే ఈ వీడియోకు లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఈ వీడియో చూసిన జనాలు అంకితపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “దీదీ, నువ్వు సుష్మితా సేన్‌కి కూడా మంచి పేరు తెచ్చావు అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. నేను దీన్ని లూప్‌లో పెట్టుకొని 10 సార్లు చూశానని మరో యూజర్ కామెంట్ చేశాడు. నీకు ప్రతిభ ఉంటే, చీరలో కూడా నువ్వు వేదికను వెలిగించగలవని మరో యూజర్ రాసుకొచ్చాడు.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
