ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బూట్లు..! బంగారం, వజ్రాలతో తయారీ.. దీని ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

కొన్నిషూల ధర వేలల్లో ఉంటుంది. అలాగే కొన్ని షూస్ ధర లక్షల్లో ఉంటుంది. ఆయా బూట్ల ధరలు వాటి మెటీరియల్, నాణ్యతను బట్టి నిర్ణయించబడతాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ ఏవో తెలుసా? ఇవి ఎక్కడ లభిస్తుంది..? దాని ధర ఎంత? ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బూట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బూట్లు..! బంగారం, వజ్రాలతో తయారీ.. దీని ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Shoes
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 07, 2024 | 10:48 AM

ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కాళ్లకు చెప్పులు తప్పనిసరి..కొందరు షూస్‌ కూడా ధరిస్తారు. ఎవరి అవసరాలు, వారు చేసే పనిని బట్టి చెప్పులు, షూస్‌ వంటివి వాడుతుంటారు.రోజువారి షూస్‌ ఒకలా ఉంటే, పెళ్లిళ్లలో డిజైనర్ దుస్తులతో ధరించే బూట్లు భిన్నంగా ఉంటాయి. ఉదయం జాగింగ్‌కు వెళ్లే బూట్లు మరోలా ఉంటాయి. ఇలా ఆయా పనులను బట్టి షూస్‌ తయారు చేస్తున్నాయి చాలా కంపెనీలు. ఇక వాటి ధరలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. కొన్నిషూల ధర వేలల్లో ఉంటుంది. అలాగే కొన్ని షూస్ ధర లక్షల్లో ఉంటుంది. ఆయా బూట్ల ధరలు వాటి మెటీరియల్, నాణ్యతను బట్టి నిర్ణయించబడతాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ ఏవో తెలుసా? ఇవి ఎక్కడ లభిస్తుంది..? దాని ధర ఎంత? ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బూట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

మూన్ స్టార్ షూ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బూట్లు ఇవే.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ బూట్ల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. దీని ధర వందలు, వేలు అనుకుంటే మీరు పొరపడినట్టే.. మూన్ స్టార్ షూస్ విలువ ఒక బిలియన్ రూపాయల కంటే ఎక్కువ. 2017 సంవత్సరంలో తయారైన ఈ జత బూట్ల ధర రూ.163 కోట్లు. ఈ షూ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. దీని తయారీకి 30 క్యారెట్ల వజ్రాలను కూడా ఉపయోగిస్తారు.దీని తయారీలో 1576 సంవత్సరానికి చెందిన ఉల్క కూడా ఉపయోగించబడిందని సమాచారం. ఈ విలువైన షూ డెలివరీ కూడా హెలికాప్టర్ ద్వారా కస్టమర్‌కు అందించారు..

ఇవి కూడా చదవండి

బుర్జ్ ఖలీఫా తరహాలో తయారు చేసిన ఈ షూ పెయిర్‌ని ఇటలీకి చెందిన ప్రముఖ డిజైనర్ ఆంటోనియో వియెట్రి డిజైన్ చేశారు.30 క్యారెట్ల వజ్రాలను వీటి తయారీలో వినియోగించారు. షూ ఆకాశహర్మ్యం-పరిమాణ మడమ బంగారంతో చేయబడింది. దాని వాంప్ కూడా వజ్రాలతో కప్పబడి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, అర్జెంటీనాలో లభించిన ఉల్క ముక్కలు కూడా ఈ బూట్లపై కనిపిస్తాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..