AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరికాళ్లు మండే ఎండలో హిందూ భక్తుల ప్రదక్షిణలు.. ఈ ముస్లిం వ్యక్తి ఏం చేశాడో చూడండి

భారత్ అంటే సర్వ మత సమ్మేళనం.. విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఎన్ని బేదాలు ఉన్నా, ఎన్ని ఖేదాలు ఉన్నా దేశమంటే అందరూ ఒక్కటవుతారు. దేశంలో మత సామరస్యానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Viral Video: అరికాళ్లు మండే ఎండలో హిందూ భక్తుల ప్రదక్షిణలు.. ఈ ముస్లిం వ్యక్తి ఏం చేశాడో చూడండి
Humanity
Ram Naramaneni
|

Updated on: Apr 06, 2024 | 7:22 PM

Share

ఏంట్రా మీ భారత్ గొప్పతనం అంటే ఈ వీడియో చూపించండి. ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్నో రకాలు ఆచార వ్యవహారాలు ఉన్నా.. మేమంతా ఒక్కటే అని చాటి చెప్పండి. తమిళనాడులో అమ్మవారి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తున్న హిందూ భక్తుల పట్ల ఒక ముస్లిం పెద్దమనిషి చూపిన మానవత్వం ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటుంది. భక్తులు తలపై పాలు పొంగళ్లు పెట్టుకుని.. నిప్పులు కక్కుతున్న రోడ్డుపై చెప్పులు లేకుండా నడుస్తున్నారు. వారికి స్వాంతన చేకూర్చేందుకు.. ఒక పైప్ ద్వారా ఆ ప్రాంతమంతా నీటిని చల్లుతున్నారు. మండుటెండలో ప్రదక్షణలు చేస్తున్న హిందూ భక్తుల కాళ్లకు నీళ్లు చల్లి ఉపశమనం కలిగిస్తున్నారు ముస్లిం సోదరులు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తన్మయానికి లోనవుతున్నారు. ఇది కదా మన దేశం అని గర్వపడుతున్నారు.

మా నేలలోనే ఆత్మీయత ఉందని పలువురు నెటిజన్లు ఈ వీడియో కింద కామెంట్స్ చేశారు. మతం ఏదైనా మనిషి తత్వం.. మానవత్వమే అని మరొకరు కామెంట్ పెట్టారు. ప్రజాదరణ చూరగొంటున్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

కాగా హైదరాబాద్‌లో కూడా గణేశ్ శోభాయాత్ర సమయంలో.. పలువురు ముస్లింలు హిందూ భక్తులకు అన్నదానం చేసిన వీడియోలు, ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి. సాటి మనిషికి సాయం కంటే.. ఒక మనిషి కడుపు నింపడం కంటే.. మించిన తృప్తి ఇంకేముంటుంది చెప్పండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.