Kitchen Tips: ఇలా చేస్తే వంటింట్లో పాలు పొంగిపోవు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
సాధారణంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు సంప్రదాయంగా పాలు పొంగిస్తారు. అయితే సాధారణ సమయాల్లో గ్యాస్ స్టౌపై వేడిచేస్తున్న పాలు పొంగిపోతే మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది...

సాధారణంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు సంప్రదాయంగా పాలు పొంగిస్తారు. అయితే సాధారణ సమయాల్లో గ్యాస్ స్టౌపై వేడిచేస్తున్న పాలు పొంగిపోతే మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా చాలామంది గృహిణులు ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. పాలు మరగబెట్టి ఇతర పనుల్లో మునిగిపోతుంటారు. ఒక్కోసారి పాలు మరగబెట్టిన విషయాన్ని కూడా మర్చిపోతుంటారు. ఫలితంగా వంటింట్లో పాలన్నీ నేలపాలవుతుంటాయి. ఈ క్రమంలో పాలు మరిగిపోకుండా ప్రముఖ రచయిత, వైద్యురాలు నందితా అయ్యర్ ఓ అద్భుతమైన చిట్కాను సోషల్ మీడియాలో పంచుకుంది.
పాస్తా, రసం విషయంలోనూ.. ‘ పాలను మరిగించేటప్పుడు గిన్నెపై చెక్క గరిటెను ఉంచడం వల్ల పాలు పొంగిపోకుండా ఉంటాయన్న విషయం మీకు తెలుసా’ అని ఆమె షేర్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకు తగ్గట్టే వీడియోలో మరిగిన పాలపై ఉంచిన చెక్క గరిటె పాలను కిందకు పొంగిపోకుండా నియంత్రించడం మనం చూడవచ్చు. ఈ వీడియోతో పాటు దీని వెనక ఉన్న సైన్స్‌ను కూడా నందిత ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘పాలు బాగా మరిగిపోయినప్పుడు వెలువడే ఆవిరి చెక్క గరిటెను తగలడంతో పాలు మరిగిపోయే ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు చెక్క గరిటె వాడడం వల్ల చెయ్యి కూడా కాలదు’ అని ఆమె రాసుకొచ్చారు. ఈ వీడియోను చూసి’ఈ చిట్కా అద్భుతంగా ఉంది. నేను ట్రై చేశాను. పాస్తా, రసం తయారీ విషయంలోనూ ఇది వర్తిస్తుంది’, అని ఒకరు కామెంట్ పెట్టగా..’మీరు ఇంతకు ముందే ఈ చిట్కాను పంచుకోవాల్సింది. పాలు పొంగిపోతుండడంతో మా అమ్మతో రోజు చీవాట్లు తింటున్నాను’ అని మరొకరు స్పందించాడు. మరి ఈ అద్భుతమైన వీడియోను మీరూ చూసేయండి.
Did you know keeping a wooden ladle over the milk pan prevents the milk from boiling over? #Cookingtip pic.twitter.com/hDC5mb51iV
— Nandita Iyer (@saffrontrail) November 10, 2021
AlsoRead:
35 తర్వాత చర్మం ముడతలు పడుతుందా..! అయితే మీరు వీటిని పాటించడం లేదు..?
మీరు హిల్ స్టేషన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..! అయితే కచ్చితంగా బ్యాగులో ఈ వస్తువులు ఉండాల్సిందే..