Viral Video: ఈ కుక్కకు బైక్ అంటే భలే ఇష్టం.. ఏం చేసిందో చూస్తే వావ్ అంటారు..

విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. ఇప్పటి సమాజంలో ప్రతి ఇంటిలో ఒక కుక్కను మంచి ధర, జాతులు చూసి కొనక్కుంటారు. చిన్న పిల్లల్లి చూసుకున్నట్లు చూసుకొంటారు..

Viral Video: ఈ కుక్కకు బైక్ అంటే భలే ఇష్టం.. ఏం చేసిందో చూస్తే వావ్ అంటారు..
Dog Video
Follow us
N Narayana Rao

| Edited By: Ravi Kiran

Updated on: Jul 20, 2023 | 3:19 PM

విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. ఇప్పటి సమాజంలో ప్రతి ఇంటిలో ఒక కుక్కను మంచి ధర, జాతులు చూసి కొనక్కుంటారు. చిన్న పిల్లల్లి చూసుకున్నట్లు చూసుకొంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్న ఈ కుక్కకు ఒక ప్రత్యేకత ఉంది, ఏ వ్యక్తి అయినా మోటార్ సైకిల్ ఎక్కి వెనుక కూర్చోవాలంటే సపోర్ట్ కావాలి, అదే నుంచోవాలంటే చాలా దైర్యం కావాలి, కానీ ఈ కుక్క మోటార్ సైకిల్‌పై ఎవరి సపోర్ట్ లేకుండా, ఎంత స్పీడ్‌గా వాహనం నడిపినా దైర్యంగా నుంచొని ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని గాండ్లగూడెం గ్రామంలో వీధి కుక్కపిల్ల గత 4 సంవత్సరాల క్రితం భూక్యా రవి ఇంటికి వచ్చిందని, అప్పటినుంచి దానిని పెంచుకుంటున్నామని, దానికి చెర్రీ అని పేరు పెట్టి, చిన్న పిల్లవాడిలాగా పెంచుకుంటున్నామని, దానిని చిన్నప్పుడు మోటార్ సైకిల్‌పై ఊరు వెళితే, కుక్కను కూడా తీసుకువెళ్లేవారని అంటున్నారు. అప్పటినుండి మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తే వచ్చి ఎక్కుతుందని పొలంకు వెళ్లినా, బయటికి వెళ్లిన మోటార్ సైకిల్ ఎక్కి కూర్చొని ఉంటుందని, అంతేకాకుండా ఏ సపోర్ట్ లేకుండా, ఎంత స్పీడ్‌లో వెళ్లిన వెనుక నిల్చుని జాలిగా ప్రయాణం చేస్తుంది. అది ఉంటే ఎంత దూరమైనా, ఎంత రాత్రి అయినా భయం ఉండదని, అనందం వ్యక్తం చేస్తున్నారు.